నేడు ఆస్ట్రేలియాతో-ఇండియా పోరు

నవతెలంగాణ – చెన్నై: మొత్తం 15 మంది.. వేర్వేరు ప్రాంతాలు.. భిన్నమైన అభిరుచులు! కానీ అందరి లక్ష్యం మాత్రం ఒక్కటే. 2011 చరిత్రను రిపీట్‌‌‌‌ చేస్తూ మరోసారి కప్‌‌‌‌ కొట్టాలె. దానికి తొలి అడుగు ఘనంగా వేసేందుకు మన వీరులు సిద్ధయ్యారు. ఓవైపు ఆసియా గేమ్స్‌‌‌‌లో అథ్లెట్లు పతకాల మోత మోగిన వేళ.. మరోవైపు సొంతగడ్డపై పరుగుల జాతర మొదలుపెట్టేందుకు టీమిండియా రెడీ అయ్యింది. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో భాగంగా ఆదివారం జరిగే తమ తొలి పోరులో ఇండియా.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. వరల్డ్‌‌‌‌ క్లాస్‌‌‌‌ బ్యాటర్లకు, అంతే స్థాయి కలిగిన కంగారూల పేస్‌‌‌‌ అటాక్‌‌‌‌ మధ్య రసవత్తర పోరాటం జరగనుంది. చెపాక్‌‌‌‌లో ఇరుజట్లకు మంచి ట్రాక్‌‌‌‌ రికార్డు ఉండటంతో ఈ మ్యాచ్‌‌‌‌లో ఫేవరెట్‌‌‌‌ను అంచనా వేయలేం.
జట్ల అంచనా
ఇండియా: రోహిత్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), గిల్‌‌‌‌ / ఇషాన్‌‌‌‌, కోహ్లీ, శ్రేయస్‌‌‌‌ / సూర్య, రాహుల్‌‌‌‌, పాండ్యా, జడేజా, అశ్విన్‌‌‌‌, కుల్దీప్‌‌‌‌, బుమ్రా, సిరాజ్‌‌‌‌.
ఆస్ట్రేలియా: కమిన్స్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), వార్నర్‌‌‌‌, మిచెల్‌‌‌‌ మార్ష్‌‌‌‌, స్మిత్‌‌‌‌, లబుషేన్‌‌‌‌, గ్రీన్‌‌‌‌, మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌, స్టార్క్‌‌‌‌, హేజిల్‌‌‌‌వుడ్‌‌‌‌, జంపా.

Spread the love