నవతెలంగాణ – హైదరాబాద్: ఆసియా క్రీడల్లో క్రికెట్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఈ గెలుపుతో భారత్ ఖాతాలో ఇంకో పతకం ఖాయమైంది. సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే నష్టపోయి 9.2 ఓవర్లలో 97 పరుగులు చేసి విజయం సాధించింది. తిలక్ వర్మ (55 2×4, 6×6 నాటౌట్) అర్ధశతకం సాధించాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (40 4×4, 3×6 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. నేపాల్‌పై సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్ ఈసారి డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. శనివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.