మతోన్మాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాలి

– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రస్తుత భారతదేశం బీజేఏపీ ప్రభుత్వపాలన మతోన్మాద ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కనుసన్నల్లో సాగుతుందని, మతోన్మాదంతో దేశ ప్రజలను విచ్చిన్నం చేస్తున్న విచ్చిన్నకరశక్తుల భారినుండి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ప్రధాన కర్తవ్యంగా ఉందని, ఐక్యంగా మతోన్మాదంపై ఉద్యమించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ పిలుపు నిచ్చారు. ఆదివారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని యుటిఎఫ్‌ భవన్‌లో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మచారి అధ్యక్షత వహించిన సభలో పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ భారతదేశం మతోన్మాదుల పాలనలో, దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టి, విడగొట్టి ఫాసిస్ట్‌ తరహా పరిపాలన కొనసాగిస్తుందన్నారు. అన్నదమ్ముల వలె ఉన్న దేశాన్ని కులమతాల కొట్లాటలతో అనేక సమస్యలు సృష్టిస్తున్న బిజెపి మతోన్మాదం పాలనపై ఐక్యంగా ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలని అమ్ముతూ కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తూ, ధనవంతు లకు అనుకూలమైన పాలన అందిస్తూ, కార్మిక వర్గాన్ని ప్రజల ను మోసం చేస్తున్న బిజెపి మోడీ విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలన్నారు. మరోవైపు దేశంలో కుల, మతాల మధ్య కొట్లాటలు పెడుతూ లౌకిక భారతదేశాన్ని విభజించు పాలించు అనే సూత్రాన్ని పాటించెల చేస్తున్నదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ లాంటి బిజెపి విచ్ఛిన్నకరమైన శక్తులు ఒక్కటై దేశాన్ని మతోన్మాదుల హింసపు సుడిగుండంలో నెట్టి వేయనున్నారని, అటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఐక్యంగా కార్మిక వర్గం తిప్పి కొట్టాలన్నారు. రానున్న ఎన్నికల్లో భారత దేశంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యమించాలని కార్మిక వర్గాన్ని కోరారు. ఇప్ప టికే కార్మిక హక్కులను కాలరాస్తూ 44 చట్టాలను నాలుగు కోడ్‌లుగా చేసి కార్మిక వర్గ ఐక్యతను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ సంస్థలను అమ్మేసి తిరోగమనంలోకి నడుపుతున్న బిజెపి విధానాలపై పోరాటం కొనసాగిస్తున్న కార్మిక వర్గం, మతోన్మాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించే విధంగా కార్మికులు కర్షకుల మైత్రితో దేశంలో, రాష్ట్రంలో బిజెపికి ఆర్‌ఎస్‌ఎస్‌కి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే.రమేష్‌, సీనియర్‌ నాయకులు అప్పారావు, జిల్లా సహాయ కార్యదర్శులు కోశాధికారి జి.పద్మ, వెంకటమ్మ, పిట్టల అర్జున్‌, గద్దల శ్రీను, వెంకటరాజు, డి.వీరన్న, కె.సత్య తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్‌ పునాదులపై భారతదేశాన్ని నిర్మించలేరు
స్వాతంత్ర ఉద్యమములో ఇసుమంతైన చరిత్ర లేని ఆర్‌ఎస్‌ఎస్‌ పునాదులపై భారతదేశాన్ని నిర్మించాలని కలలు కంటున్న బిజెపి విధానాలపై ఎక్కుపెట్టి పోరాటం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బిజేపి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు.
– సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు

Spread the love