బోర్గం( పి) నుండి ఎల్లమ్మ కుంట వరకు బైక్ ర్యాలీ

నవతెలంగాణ- మోపాల్

మోపాల్ మండలంలో గల బోర్గం( పి) చౌరస్తా నుండి ఎల్లమ్మ కుంట తండా వరకు మాజీ ఎంపీపీ మరియు కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, అక్కడ సంబరాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ దాదాపు పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలంగాణ ఇచ్చిన పార్టీ తెలంగాణ అభివృద్ధి చేసే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అని పది సంవత్సరాల తర్వాత మంచి రోజులు వచ్చాయని తమ కార్యకర్తలు రాత్రి అనక పగలనకా కష్టపడ్డందుకు ఆ దేవుడు కరుణించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిందని, కచ్చితంగా రైతులకు మరియు నిరుపేదలకు మంచి రోజులు వచ్చాయని ఆయన తెలిపారు. అలాగే దాదాపు పది సంవత్సరాల కాలంలో నాతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు టిఆర్ఎస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది.  ఏక్కడ కూడా భయపడకుండా పోరాడుతూ ఎదిరించాం ఒక  కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా ఎన్నో బాధలు భరించాం, అప్పుడు కష్టపడ్డ కార్యకర్త ప్రతి ఒక్కరికి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని ఆయన తెలిపారు. ప్రస్తుత బీఆర్ఎస్ పాలనపై ప్రజలు చాలా విరక్తి చెందారని ఏ పథకంలోనైనా సంక్షేమం విషయంలో కమిషన్లు ఇచ్చేంతవరకు పేదవాడికి ఆ పథకం లబ్ధి పొందడం లేదని, అలాగే అవినీతికి కూరుకుపోయిందని నిరుపేదవాడు మరింత నిరుపేదవడిగ మిగిలిపోయాడే తప్ప కనీస అవసరాలు కూడా దిక్కులేని స్థితిలో ఉన్నాడని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందరికీ సమన్యాయ పాలన ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు బున్నె రవి తదితరులు పాల్గొన్నారు
Spread the love