బీజేపీకి చరిత్ర తెలియదు

BJP does not know history– దాన్ని తిరగరాయడమే తెలుసు
– ప్రధాన సమస్యలను తప్పుదోవ పట్టించేందుకే తంటాలు : అమిత్‌షా వ్యాఖ్యలపై రాహుల్‌ ఆగ్రహం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అమిత్‌ షా సహ బీజేపీ నేతలకు చరిత్ర తెలియదు. వారికి చరిత్ర తెలుస్తుందని ఊహించనూలేం. దానిని తిరగరాసే అలవాటు మాత్రం ఉంది. అందుకే పదే పదే దాన్ని తిరగరాస్తూనే ఉన్నారు” అని రాహుల్‌ అన్నారు.. దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని అన్నారు. ”ప్రాథమిక సమస్య కుల ప్రాతిపదికన జనాభా గణన, నిరుద్యోగం, దేశంలోని ధనమంతా ఎవరి చేతుల్లో ఉంది? వీటిపై చర్చించేందుకు బీజేపీ భయపడుతోంది. అందుకే వీటి నుంచి పారిపోతోంది. మేము ఈ సమస్యను ముందుకు తీసుకెళ్తున్నాం” అని రాహుల్‌ స్పష్టం చేశారు. దేశంలోని ప్రధాన సమస్యల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ నెహ్రూపై ఆరోపణలు చేస్తుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. పార్లమెంట్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ”పండిత్‌ నెహ్రూజీ తన జీవితాన్ని ఈ దేశానికి అంకితమిచ్చారు. దేశ ప్రజల కోసం ఏండ్ల తరబడి జైల్లో ఉన్నారు. ”పేదలకు దక్కాల్సినవి దక్కుతాయి… ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి కూడా ఓబీసీనే. వారు కూడా ఓబీసీ సీఎం అని ప్రకటించారు. అయితే వారిలో ఎంత శాతం మంది నిర్మాణంలో ఉన్నారనేది ప్రశ్న? పీఎం మోడీ ఓబీసీ కేటగిరీ. అయితే 90 మందితో ప్రభుత్వం నడుస్తోంది. వారిలో ముగ్గురు మాత్రమే ఓబీసీకి చెందినవారు. వారి కార్యాలయాలు మూలన ఉన్నాయి. నా ప్రశ్న సంస్థాగత వ్యవస్థలో ఓబీసీలు, దళితులు, గిరిజనుల భాగస్వామ్యం గురించి. వారు ఈ సమస్య నుంచి దేశప్రజల దృష్టి మరల్చడానికి జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇతరుల గురించి మాట్లాడుతున్నారు” అని అన్నారు.

Spread the love