– ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్
– ఎస్ఐఆర్ నమోదులో బీఎల్ఏ లదే క్రియాశీలక పాత్ర
– డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లిలోని సిద్ధారం రోడ్డు లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లతో (బీఎల్ఏ) విస్తృత స్థాయి సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, నియోజకవర్గ ఇంచార్జ్ దయద రవీంద్ర, పార్లమెంటరీ ఇంచార్జ్ గోపిశెట్టి రాఘవేంద్రరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి బీఎల్ఏలు వెన్నెముక అని అన్నారు.
క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకమైనదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికీ చేరవేసే బాధ్యతను నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలని పిలుపు నిచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) నమోదు కార్యక్రమంలో బీఎల్ఏ లదే కీలక పాత్రని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ అన్నారు. కొత్త ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియను బాధ్యతాయుతంగా నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. ఓటర్ల జాబితాలోని తప్పుల సవరణలు, మార్పులపై బీఎల్ఏలు నిరంతరం దృష్టి సారించాలని సూచించారు. రాబోయే రోజుల్లో చేపట్టబోయే పార్టీ కార్యక్రమాలపై బీఎల్ఏలకు స్పష్టమైన కార్యాచరణను వివరించారు.
నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, నాయకులు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ఆ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు.
ఈ సమావేశంలో సత్తుపల్లి, కల్లూరు మున్సిపల్ చైర్‌పర్సన్లు మొహమ్మద్ రెహానా కమల్, మోహన్ నాయక్, ఏఎంసీ చైర్మన్లు దోమ ఆనంద్ బాబు, బాగం నీరజదేవి, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, మొహమ్మద్ కమల్ పాషా, నారాయణవరపు శ్రీనివాస్ పింగుల సామేలు, నాయుడు వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



