మూడవసారి ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే

నవతెలంగాణ- తిరుమలగిరి
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో తుంగతుర్తి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తాను మూడవసారి  ఎన్నికల బరిలో నిలిచానని తనను ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చేస్తానని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం  తిరుమలగిరి మండల పరిధిలోని మామిడాల, కోక్యా తండా, చింతలకుంట తండా గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిది సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని  అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి సహకారంతో తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తాను ప్రజలకు కావలసిన సౌకర్యాలను కల్పించాలని అన్నారు.ఒకనాడు కక్షలు,రక్తపుటేర్లతో అట్టుడికిన తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత  హత్యా రాజకీయాలకు స్వస్తిపలికి ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించేలా తాను కృషి చేశారని చెప్పారు. గతంలో సాగు, తాగునీటి కోసం ఎంతో ఇబ్బంది పడుతున్న రైతులకు ప్రజానీకానికి వారి బాధలు చూడలేక ముఖ్యమంత్రితో ఒప్పించి తుంగతుర్తి ప్రాంతానికి కాలేశ్వరం జలాలను రప్పించానని ఆయన చెప్పారు. కాలేశ్వరం, పాలేరు మిషన్ భగీరథ ద్వారా నియోజకవర్గంలో సాగు తాగు  సమస్యలు పరిష్కరించానని అని చెప్పారు. గతంలో మంచినీటి కోసం ప్రజలు మైళ్ళకొద్దీ వెళ్లి నీరు తెచ్చుకునేవారనీ చెప్పారు. రైతులు సాగునీరు లేక బోరుబావులు ఎండిపోయి వచ్చి రాని కరెంటుతో 24 గంటలు వ్యవసాయ భావుల వద్ద కరెంటు కోసం పడి కాపులు కాసేవారిని ఆయన చెప్పారు. కానీ నేడు అటువంటి పరిస్థితి లేకుండా 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు ప్రజలకు తాగునీరు అందించి మిషన్ భగీర ద్వారా గ్రామాల్లోకి ఇంటింటికి నీరు అందిస్తున్నామని చెప్పారు. అలాగే తిరుమలగిరి మండలంలోని గిరిజన తండాలను గ్రామపంచాయతీలగా మార్చి సకల సౌకర్యాలతో గ్రామపంచాయతీ కార్యాలయాలు, పల్లె ప్రకృతి వనం స్మశానవాటికలు నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. కోక్యా  తండకు 90 లక్షలతో బీటీ రోడ్డు నిర్మానానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు.తనను మూడోసారి ఆశీర్వదించి గెలిపిస్తే ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు.వృద్ధులకు,, వితంతులకు, ఒంటరి మహిళలకు, ఆసరా పథకం ద్వారా పెన్షన్లను పెంచిన ఘనత ముఖ్యమంత్రిగా దక్కిందని ఆయన చెప్పారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లను  ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెంచడం ఖాయమని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం లో ముఖ్యమంత్రి దేశ స్థాయిలో గుర్తింపు పొందాడని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు గిరిజనులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా మామిడాల ఎక్స్ రోడ్ ఎక్స్ రోడ్లో ఆంజనేయ స్వామి దేవాలయం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ తిరుమలగిరి మండల శాఖ అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, జెడ్పిటిసి దుపటి అంజలి రవీందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొమ్మినేని స్రవంతి సతీష్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్, ఎం పిటి సి పొన్న సమత వెంకన్న, టిఆర్ఎస్ నాయకులు కందుకూరి లక్ష్మయ్య, తెడ్డు భాస్కర్, బత్తుల శ్రీనివాస్,బానోత్ యాకుబ్ నాయక్, ఎం డి షకీల్, కందుకూరి బాబు, సంకేపల్లి నరోత్తం రెడ్డి, మోడెపు సురేందర్,వట్టే కృష్ణ, సోమయ్య సర్పంచులు బెడిదే కరుణాకర్,.జాతోత్ రవి, ఆకుల వీరయ్య, పాక రేణుక వెంకన్న,లకావత్ శ్రీను, తోపాటు పలువురు పాల్గొన్నారు.

Spread the love