అన్ని రంగాలలో అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి

నవతెలంగాణ- తిరుమలగిరి: పదేళ్ల కాలంలో తుంగతుర్తి నియోజకవర్గం వర్గాన్ని మునుపెన్నడు లేని విధంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేశా మరో మారు  ఆశీర్వదించి గెలిపించండి  అభివృద్ధిని కొనసాగిద్దాం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని  నెల్లిబండ తండా, ఈదుల పర్రే తండా మండలంలోని తాటిపాముల గ్రామంలో పర్యటించారు. ఆయా గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళల కోలాటాలు, డప్పు చప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. నీళ్లు లేక బీటలు వారిన నేలలకు మూడు పంటలకు కాలేశ్వరం ద్వారా సాగునీరు అందించి  సస్యశ్యామలం చేశారన్నారు. అదేవిధంగా దళితులు ఆర్థికంగా ఎదగాలని ఆలోచనతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ఏర్పాటు చేస్తే, ఆ పథకాన్ని  తిరుమలగిరి మండలానికి తీసుకొచ్చి ఈ ప్రాంతం వారికి  దళిత బంధు అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా  పేదల ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని ఉద్దేశంతో రూ.1.16 లక్షలు అందిస్తున్న ఏక రాష్ట్రం తెలంగాణ అన్నారు. 200 రూ. పింఛన్ ను  2000రూ.  పెంచినట్లు తెలిపారు. మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే 2000 పింఛన్  ను  5000రూ లకు, దివ్యాంగులకు 6000 రూ., కేసీఆర్ బీమా, సన్నబియ్యం,సౌభాగ్య లక్ష్మి కింద నెలకు 3000రూ., 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు కట్టిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మళ్లీ కరెంట్ కష్టాలు తప్పవని,  మళ్లీ మూడు గంటల కరెంటే ఇస్తుందని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను గుర్తుపెట్టుకుని, జరిగిన అభివృద్ధిని చూసి ఆలోచించి  రాబోయే అసెంబ్లీ ఎన్నికల నవంబర్ 30వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారితో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోతరాజు రజిని రాజశేఖర్, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, పిఎసిఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్, బీఆర్ఎస్ వి జిల్లా నాయకులు కల్లట్లపల్లి శోభన్, తాటిపాముల గ్రామ సర్పంచ్ ఎర్ర శోభ శ్రీనివాస్, వార్డ్ కౌన్సిలర్లు, ఎంపిటిసిలు గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ నాయకులు నాని, బాబు,  అడ్డబొట్టు చారి, ఆనగందుల మల్లేష్, కందుకూరి పవన్ గిరిజన నాయకులు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love