మీ బిడ్డగా అశ్విర్వదించండి…ఐదేళ్లు సేవాలందిస్తా

– బీఆర్‌ఎస్‌ మేనీఫెస్టోను గడపగడపకు తీసుకెల్లాలి
– బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌
నవ తెలంగాణ: మల్హర్ రావు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏండ్లుగా అధికారంలో ఉండి చేసింది శున్యమని,తనకు ఓటువేసి అశ్విర్వదిస్తే,ఐదేళ్లుగా సేవలందిస్తానని బిఆర్ఎస్ మంథని బీఆర్‌ఎస్‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ కోరారు.మండల కేంద్రమైన తాడిచెర్లలో శనివారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎన్నికల భూపాలపల్లి జెడ్పి చైర్మన్ జక్కు శ్రీహరినితో కలిసి ఆయన పాల్గొని ప్రసగించారు.కాంగ్రెస్ అనేక ఏండ్ల పరిపాలనలో ప్రజలకు చేసింది శూన్యుమన్నారు.ఒక బీసీ బిడ్డగా ఈ స్థాయికి ఎదిగితే అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తూ రాజకీయ సమాధి చేసేందుకు ప్రయత్నాలు చెస్తున్నట్లుగా ఆరోపించారు.తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం విశ్వాసం ఉందని, ఎక్కడ చూసినా ఏ పెద్ద మనిషిని అడిగినా సీఎంకేసీఆర్‌ పెద్ద కొడుకు అని చెబుతున్నారే కానీ కాంగ్రెస్సోళ్ల గురించి మాట్లాడటం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అంటేనే ప్రజల పార్టీని, ప్రజల కోసమే పనిచేసే పార్టీని ఆయన గుర్తుచేశారు. ప్రజాసంక్షేమంకోసం పనిచేసే బీఆర్‌ఎస్‌పార్టీని ప్రజలు ఆదరించి అండగా నిలువాలన్నారు.బీఆర్‌ఎస్‌ పార్టీఎన్నికల మేనీఫెస్టోను గడపగడపకు తీసుకెల్లే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని, మన పథకాలకు మనమే గ్యారెంటీ అనిచెప్పుకోవాలని ఆయన సూచించారు. గొప్పగా ఆలోచన చేసి బారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ ఇచ్చిన ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.అధికారంలోకి రాగానే కిషన్ రావు పల్లి నుంచి భూపాలపల్లి వరకు ఆటవిమార్గం గుండా రోడ్డు,పేద విద్యార్థుల చదువుల కోసం ఖర్చులు,నిరుపేద అడడ్డలకు సామూహిక వివాహాలు చేస్తామన్నారు.కాంగ్రెస్ వాళ్ళ నోట్లకట్టల ప్రలోభాలకు గురికావవద్దని ఆలోచన చేసి ఓటు వేయాలన్నారు.
అన్నా అంటే నేనున్నానే నాయకుడు పుట్ట…జక్కు శ్రీహర్షిని
పేద ప్రజలు అన్నా అంటే నేనున్నాను అనే నాయకుడు పుట్ట మధుని భూపాలపల్లి జెడ్పి చైర్మన్ జక్కు శ్రీహర్షిని అన్నారు..బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజాసేవలో నిమగ్నమైన పుట్ట మధూకర్‌కు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారని,నాలుగేండ్ల పాటు ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేశాడని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు తన సొంతంగా అనేక సేవలు అందించి ప్రజల మన్ననలు పొందారన్నారు.బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనీపేస్టోలో పొందుపర్చిన ప్రతి పథకం దేశం గర్వించేలా ఉన్నాయని, ఎక్కడా ఇలాంటి పథకాలు అమలుచేయడం లేదని ఆమె వివరించారు. రాబోయేది రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, మంథనిలో గులాబీ జెండాను ఎగురవేసి మదును బారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంకరి సత్తయ్య, ఎంపిటిసి రావుల కల్పన మొగిలి, రైతు సమితి అధ్యక్షుడు గొనె శ్రీనివాసరావు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవ రెడ్డి,యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్,కొప్సన్ ఆయూబ్ ఖాన్,తాజాద్దీన్, యదగిరిరావు,మల్లేష్,సది పాల్గొన్నారు.

Spread the love