భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం

నవతెలంగాణ – గోవిందరావుపేట
విప్లవ వీరుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండలంలోని పసర సెయింట్ మేరీ పాఠశాలలో ఎస్ఎఫ్ఐ మరియు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.  ప్రభుత్వ రక్తనిధి కేంద్రం ములుగు సిబ్బంది 19 మంది యువకుల నుండి రక్తాన్ని సేకరించారు. ఎస్ఐ ఏ కమలాకర్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి యువత ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరెన్నో చేపట్టి తాము దానం చేస్తున్న రక్తం ద్వారా ఎందరికో ప్రాణదానం చేయాలని అన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఇలాంటి రక్తదానం కార్యక్రమాన్ని చేపట్టడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలోఎస్ఎఫ్ఐ డివిజన్ సెక్రెటరీ సిరిపల్లె జీవన్, డివైఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్  పిట్టల అరుణ్, డివైఎఫ్ఐ మండల నాయకులు మాదాసు శ్రావణ్, జిట్టబోయిన అరవింద్, కణాల సందీప్,  ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు .
Spread the love