మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆ లోపు కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనవరి 2024- 12 న ఉదయం 11 గుంటలకు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ బి ఎల్ టి యు ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (బి ఎల్ టి యు) రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, నగర నాయకులు ఎ.హరీష్ , సహాదేవ్ పాల్గొన్నారు.