గ్రామపంచాయతీ లో ఘనంగా బోనాలు బతుకమ్మ చెరువు పండుగ

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గురువారం నాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బోనాలు బతుకమ్మ చెరువు పండుగను గ్రామ సర్పంచ్ సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బోనాలు బతుకమ్మ పండుగ నిర్వహణ కోసం సర్పంచ్ సురేష్ గ్రామ కార్యదర్శి సందీప్ ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విట్టల్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పశు వైద్య డాక్టర్ విజయ్ సొసైటీ మాజీ చైర్మన్ పాకలవార్ విజయ్ పంచాయతీ పాలకవర్గం సభ్యులు ఎంపీటీసీలు మహిళా సంఘాల సభ్యులు మహిళలు భాజా భజంత్రీలతో గ్రామపంచాయతీ నుండి ఊరేగింపుగా మైసమ్మ చెరువుకు చేరుకొని బతుకమ్మ ఆటపాటలతో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు అక్కడే భోజనాలు చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు మహిళలు చిన్నారులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love