Monday, June 29, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబీజేపీ, కాంగ్రెస్ రెండూ మూసీకి ఉరి

బీజేపీ, కాంగ్రెస్ రెండూ మూసీకి ఉరి

- Advertisement -

మోడీ భయంతోనే నేవీ రాడర్‌‌కు రాష్ట్రం
2900 ఎకరాల భూమి అప్పగింత
12 లక్షల చెట్లు నరికివేత
2028లో మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి
వికారాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ-వికారాబాద్

బీజేపీ, కాంగ్రెస్‌ ‌రెండు పార్టీలూ కలిసి మూసీకి ఉరేశాయని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ఆరోపించారు. మోడీ భయంతోనే నేవీ రాడర్‌‌కు రాష్ట్ర ప్రభుత్వం 2900 ఎకరాల భూమి (మొదటిపేజీ తరువాయి)
అప్పగించిందని తెలిపారు. దీని కోసం 12లక్ష‍ల చెట్లు నరికివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం వికారాబాద్‌ పట్టణంలోని గౌలి కార్ ఫంక్షన్ హాల్‌‌లో మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్ష‍ుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అధ్యక్షతన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం, సర్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కేటీఆర్, మెతుకు ఆనంద్ ఎన్నెపల్లి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. కేసీఆర్ అప్పులు చేశాడని స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ పదేపదే చెప్పడం సరైంది కాదన్నారు. అప్పులు చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించారని తెలిపారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రెండున్నరేండ్లలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు నేవీ రాడర్‌‌కు భూములు అడిగితే ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ‌బీజేపీతో కుమ్మక్కై దామగుండంలో నేవీ రాడర్‌‌కు భూములిచ్చిందని తెలిపారు.
వికారాబాద్ నియోజకవర్గ పరిధిలో పదివేల ఎకరాలకు నీళ్లు అందించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. తాము 90శాతం పనులు పూర్తి చేశామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టును పక్కన పెట్టిందని అన్నారు. కేసులకు కార్యకర్తలు, నాయకులు భయపడవద్దని తెలిపారు. 2028లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్‌ ‌నియోజకవర్గంలో 284 పోలింగ్ బూత్‌ల్లో పది మందితో 2,840 కమిటీలు వేసుకోవడం మంచి పరిణామమఅన్నారు. వికారాబాద్‌ ‌వెళ్తున్న క్రమంలో మొయినాబాద్‌‌లోని తెలంగాణ అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబాన్ని కేటీఆర్‌ ‌పరామర్శించారు.
యాదిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డి, మహేష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గట్టు రామచంద్రరావు, పట్టణ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్, వేణుగోపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, డి.వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -