వరద కాలువ సమీపంలో బాలుడు లభ్యం

నవతెలంగాణ –  మోర్తాడ్
మండల కేంద్రంలోని వరద కాలువ సమీపంలో సంవత్సరం గల బాలుడు లభించినట్లు మోర్తాడ్ ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామపంచాయతీ కి చెందిన దుర్గయ్య అనే వర్కర్ చెత్తను వరద కాలువ సమీపంలో పాడవేయడానికి వెళ్ళగా అక్కడ సంవత్సరం గల పిల్లగాడు ఏడుపు విని ఎవరో ఇక్కడ ఉన్నట్లు గమనించి, గ్రామపంచాయతీ అధికారికి సమాచారం ఇవ్వడంతో, పంచాయతీ అధికారులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి ఆ బాలుడిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి, ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. గత రెండు రోజుల క్రితం నిజామాబాదులో అదృశ్యమైనట్లు బాలుడు వివరాలు తెలుస్తుందని, జిల్లా పోలీసు అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. లభించిన బాలుడిని అంగన్వాడీ సూపర్వైజర్ ఉషారాణి, అంగన్వాడి వర్కర్ జ్యోతిపోలీసులు ఆ బాలుడిని ఆర్మూర్ ఏసిపి ఆదేశాల మేరకు నిజాంబాద్ తరలిస్తున్నట్లు తెలిపారు.
Spread the love