పదేండ్లు కార్మికులకు ఏం చేయని బీఆర్ఎస్, బీజేపీ

– పార్లమెంటు ఎన్నికల్లో ఓటు అడిగే నైతికహక్కులేదు
– రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు 
నవతెలంగాణ రామగిరి: రామగిరి మండల పరిధి సింగరేణి ఆర్జీ-3 ఏరియాలోని ఓసిపి- 2 లో అర్జీ త్రీ ఏరియా ఉపాధ్యక్షుడు కోట రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గేట్ మీటింగ్ లో కాంగ్రస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్ధి గడ్డం వంశీకృష్ణతో కలసి పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ఐ ఎన్ టియు సి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఎన్నికల ప్రచార నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఐటి పరిశ్రమల & శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ.. పదేండ్లు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ బిజెపి పార్టీలు సింగరేణి కార్మికులకు ఏం చేయలేదని పార్లమెంటు ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు వారికి లేదని అన్నారు. అదేవిధంగా సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తామని,కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్మికుల ఇన్కమ్ టాక్స్ స్లాబ్ సవరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామనీ, గడ్డం వంశీకృష్ణ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే యువకుడు పారిశ్రామికవేత్త అయిన వంశీకృష్ణ మన ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాడని వంశీకృష్ణకు మద్దతు తెలిపాలని మంత్రి శ్రీధర్ బాబు కార్మికులను కోరారు. అలగే పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికలు మే 13న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాక వెంకట స్వామి వారి మనుమడు గడ్డం వంశీకృష్ణ ప్రతి కార్యకర్త పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించలనీ అన్నారు.
పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ,ఈ పార్లమెంటు ఎన్నికలలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మన కోసం 5 న్యాయ గ్యారంటీలు అయిన1. రైతులందరికీ కనీస మద్దతు ధర, 2. ఉపాది హామీ కూలీలకు రోజుకు రూ. 400 పెంపు, అలగే, 3. ప్రతి పేద కుటుంబ మహిళకు ఏటా లక్ష రూపాయలు, 4. రూ. 25 లక్షల వరకు క్యాష్ లెస్ వైద్య సాయం అందేలా హెల్త్ స్కీం, 5. నిరుద్యోగులకు 30 లక్షల ఉద్యగాల కల్పన అనే పథకాలను ప్రవేశపెట్టారని వాటిని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా అమలు చేస్తుందని వంశీకృష్ణ అన్నారు. అదేవిధంగా పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంగాని, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతితో, అధిక ధరలతో నిరుద్యోగంతో ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. అలాగే ఐ ఎన్ టి యు సి సెక్రెటరీ జనరల్, మినిమం వేజ్ బోర్డ్ కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ, పదేండ్లు టీబీజీకేస్ యూనియన్ అధికారంలో ఉండి కార్మిక సమస్యలు పరిష్కరించ పోగా సింగరేణిలో రాజకీయ జోక్యం పెంచి సింగరేణినీ, నిర్వీర్యం చేయడం జరిగిందని అన్నారు.
అలాగే పదేండ్లు సింగరేణిలో రిక్రూట్మెంట్ లేకపోవడం వలన కార్మికుల సంఖ్య 60 వేల నుండి 40 వేలకు పడిపోయిందని, కొత్త బావులు తీసుకరాక పోగా ఉన్న బావులను ప్రవేట్ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అదేవిధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి శ్రీధర్ బాబుతోని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తోనీ, సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి కొత్త బావులతో పాటుగా సింగరేణిలో రిక్రూట్మెంట్ ద్వారా కొత్త ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం అనీ అన్నారు. అలాగే డిపెండెంట్ ఉద్యోగం ద్వారా వచ్చేటువంటి కార్మికుల వయసును 35 ఏండ్లు నుంచి 40 ఏండ్లు వరకు పెంచడం జరిగిందని, ఇవే కాకుండా అనేక విషయాలు ఎప్పటికప్పుడు యజమాన్యంతోని మాట్లాడుతూ సమస్యలు పరిష్కారానికి మా వంతు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ రామగిరి మండల ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొలిపాక సుజాత, ఐ ఎన్ టి యు సి నాయకులు ఉయ్యాల కుమారస్వామి, రామిల్ల మనోహర్, నాయకులు తులసిరామ్ గౌడ్, ముస్త్యాల శ్రీనివాస్, కాట సత్యం తీగల సమ్మయ్య, కాంగ్రెస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు పబ్బతి రాధారెడ్డి, ఉపాధ్యక్షురలు జాగరి రజిత, ఆరెల్లి విజయ సాయి గౌడ్, మాజీ సర్పంచులు సీనియర్ నాయకులు, యువజన నాయకులు, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, బీసీ సెల్ , ఐ ఎన్ టి యు సి, ఎన్ ఎస్ యు ఐ నాయకులు కార్యకర్తలు సింగరేణి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love