రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు వ్యాలిడిటీ అయిపోయింది

– మాజీ శాసనసభ్యులు వేముల వీరేశం
నవతెలంగాణ-రామన్నపేట
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యాలిడిటీ అయిపోయిందని ఆ పార్టీని, కేసీఆర్‌ను నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు అడెం సంజీవరెడ్డి విమర్శించారు. శక్రవారం స్థానిక జేపీ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీలోకి మండలంలోని వెల్లంకి గ్రామ ఎంపీటీసీ-2 తిమ్మపురం మహేందర్‌ రెడ్డి, రామన్నపేట పట్టణ బిఆర్‌ఎస్‌ పార్టీ మాజీ అధ్యక్షులు రామిణి రమేష్‌, పల్లివాడ గ్రామ సర్పంచ్‌ కడమంచి సంధ్య స్వామి, వెల్లంకి బిఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎడ్ల సురేందర్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ నకిరేకంటి స్వప్న రవీందర్‌, నాయకులు తూటి మురళి, బొడ్డు శంకరయ్య తో పాటు సుమారు 300 మంది కార్యకర్తలు, మండలంలోని సర్నెని గూడెం బిఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నర్ర నరసింహ, 10వ వార్డ్‌ సభ్యులు రూపాని మల్లయ్య, గ్రామానికి చెందిన 150 మంది కార్యకర్తలు నకిరేకల్‌ మాజీ శాసనసభ్యులు వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ లో చేరారు. మరింత దగ్గర కావడానికి కార్యకర్తలందరూ ఇంటింటికి వెళ్లి విస్తతంగా ప్రచారం చేయాలని వారు సూచించారు. సోనియా గాంధీ 6 గ్యారంటీలను నమ్ముతున్నట్లుగా బిఆర్‌ఎస్‌ పార్టీ, కెసిఆర్‌ ఇస్తున్న హామీలను ప్రజలు విశ్వసించటం లేదని వారు ఆరోపించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రానున్నది కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమేనని వారు తెలిపారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, సీనియర్‌ న్యాయవాదులు జినుకర ప్రభాకర్‌, పున్న రమేష్‌, మాజీ మండల అధ్యక్షుడు గంగుల వెంకట రాజా రెడ్డి, ఎండి జమీరుద్దీన్‌, పోలు వెంకట్‌ రెడ్డి, దొమ్మాటి మల్లారెడ్డి, బండమీది స్వామి, పున్న నరసింహ, సంగిశెట్టి సుదర్శన్‌, జెల్లా వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love