అబద్ధపు ఆరోపణలను ఖండించిన బీఆర్ఎస్ నాయకులు..

నవతెలంగాణ-ఆర్మూర్
బిఆర్ఎస్ పార్టీని, కౌన్సిలర్లపై బిజెపి పార్టీ నాయకులు అబద్ధపు ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేయడం దురదృష్టకరమని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పండిత్ పవన్ సోమవారం అన్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ, మైనర్ బాలికపై అత్యాచారం అనే మాటలు నిరాధారమైన ఆరోపణలని పూర్తి ఆధారాలతో ముందుకు రావాలని తెలిపారు. కౌన్సిలర్ భర్త పై అంటూ తప్పుడు ఆరోపణలు చేశారని, బిఆర్ఎస్ పార్టీపై ప్రజలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో తప్పుడు వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. ఆర్మూర్ పోలిస్ టౌన్ ఎస్ ఏచ్ ఓ సురేష్ బాబు కి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. బిఆర్ఎస్ పార్టీపై, పార్టీ శ్రేణులపై తప్పుడు ఆరోపణలు చేసిన బిజెపి నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఖందేష్ శ్రీనివాస్, మెడిదల రవి గౌడ్, రంగన్న ఎస్ ఆర్ రమేష్, శివ, రవి తదితరులు పాల్గొన్నారు.
Spread the love