మైనంపల్లి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులు

నవతెలంగాణ-కోహెడ
మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద మంగళవారం బీఆర్‌ఎస్‌ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మంత్రి తన్నీరు హరీశ్‌రావుపై అనుచిత వాఖ్యలు చేసిన మైనంపల్లి హనుమంతరావు వెంటనే క్షమపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారని అలాంటి వ్యక్తిపై అనుచిత వాఖ్యలు చేయడం పట్ల మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, పార్టీ మండల అధ్యక్షులు ఆవుల మహేందర్‌, జెడ్పీటీసీ నాగరాజు శ్యామల మధుసూదన్‌రావు, సీనియర్‌ నాయకులు కర్ర రవీందర్‌, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు జాగిరి కుమారస్వామి, మాజీ జెడ్పిటిసి పొన్నాల లక్ష్మయ్య, కోఆప్షన్‌ సభ్యులు అబ్దుల్‌ ఖదీర్‌, నాయకులు ఇప్పలపల్లి కృష్ణమూర్తి, అబ్దుల్‌ రహీం, తిప్పారపు నాగరాజు, పొన్నం అంజయ్య, బండమీది రాజమౌళి, పాము శ్రీకాంత్‌, ముప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, బాపురెడ్డి బోలుమల ఎల్లయ్య, పిల్లి సంపత్‌కుమార్‌, నాగు మల్లయ్య, అన్నబోయిన బిక్షపతి, గుండ మల్లేశం, బత్తిని తిరుపతి, ముంజ శ్రీనివాస్‌, కొత్తూరి రాజేందర్‌, ఆవుల చిన్నమహేందర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ యువత ఉపాధ్యక్షులు తోట రాజ్‌కుమార్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వేల్పుల శంకర్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love