
నవతెలంగాణ పెద్దవంగర:
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అన్నారు. శనివారం మండలంలోని చిట్యాల గ్రామ చెరువులో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన చేపపిల్లలను ముదిరాజ్ నాయకులతో కలిసి వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మత్స్యకారుల కమ్యూనిటీ హాలు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజు, మాజీ వార్డు సభ్యులు రాపోలు సుదర్శన్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పులుగుజ్జ శ్రీధర్, ముదిరాజ్ నాయకులు పిట్టల వెంకన్న, పిట్టల రాములు, గుంటుక శ్రీనివాస్, గుంటుక యాకయ్య, గుంటుక వెంకన్న, గుంటుక అంజయ్య, నారబోయిన స్వరాజ్యం, పాక నరేష్, పాక నాగయ్య, పాక జగదీష్, పాక సంపత్, బీఆర్ఎస్ నాయకులు తోట చందర్, గొడుగు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.