బీఆర్‌ఎస్‌ను ఇంటికి పంపాలి

– కాంగ్రెస్‌కు ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలి
– రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్‌
– హైదర్షాకోట్‌ ఐదవ వార్డుల్లో ప్రచారం
నవతెలంగాణ-గండిపేట్‌
పేద ప్రజలను పట్టించుకోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొర్రా జ్ఞానేశ్వర్‌ ముదిరాజు కోరారు. మంగళవారం గండిపేట్‌ మండలం బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైదర్షాకోట్‌లో ఆ పార్టీ కార్పొరేటర్‌ షాపూరం శ్రీనాథ్‌రెడ్డి (మిట్టు) ఆధ్వర్యంల్లో ఐదవ వార్డుల్లో జోడో యాత్రల్లో భాగంగా ఇంటింటి కాంగ్రెస్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలన్నారు. ఖమ్మంలో నిర్వహించిన రాహుల్‌ గాంధీ బహిరంగా సభకు దేశంలో, ఇటు రాష్ట్రంలో ఛైతన్యం వచ్చిందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను మరో సారి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌కు ఒక్కసారి అవకాశం కల్పించాలని ఇంటింటికి తిరిగి ప్రజలను కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి, ఆక్రమాలకు పాల్పడుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ తరుపున వచ్చే ఎన్నికల్లో జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలని నాయకులు కోరారు. ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందన్నారు. ఇందిరమ్మ రాజ్యంల్లో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ బండ్లగూడ అధ్యక్షులు పూలపల్లి కృష్ణారెడ్డి, ఎ బ్లాక్‌ అధ్యక్షులు డప్పు నవీణ్‌కుమార్‌, కార్పొరేటర్‌ షాపూరం శ్రీనాథ్‌రెడ్డి, బీస్సీ సెల్‌ అధ్యక్షులు అంకం శ్రీనివాస్‌ సినీయర్‌ నాయకులు బోగాల శ్రీనివాస్‌, కొరివి గణేష్‌, ప్రేంకుమార్‌, విష్ణు, లక్ష్మన్‌, శ్రీకాంత్‌, కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love