సుప్రీంకు బీఆర్‌ఎస్‌?

BRS for Supreme?– కాంగ్రెస్‌ అలర్ట్‌!
– ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై గులాబీ బాస్‌ కసరత్తు
– ఆలోపే మిగతా ఎమ్మెల్యేలనూ చేర్చుకోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌
– ఈనెల 27న హైకోర్టులో దానం అనర్హత కేసు విచారణ
– రంజుగా మారుతున్న రాష్ట్ర రాజకీయాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మాజీ స్పీకర్‌, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పార్టీవీడటాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో అలర్ట్‌ అయిన గులాబీ బాస్‌ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు తలుపులు తట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై న్యాయనిపుణులతో తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ నెల 27న ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు కేసు హైకోర్టులో విచారణకు రానున్న సంగతి తెలిసిందే. ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా తమ పార్టీ సింబల్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేలపై సీరియస్‌గా ముందుకెళ్లాలని బీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరి మూడు నెలలు పూర్తికానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెలల్లో అనర్హత పిటిషన్‌ పైన స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలనే నిబంధన ఉన్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా నెంబర్‌ 30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ హైకోర్టు దానంపై అనర్హత వేటు వేయకుంటే ఇటీవల బీఆర్‌ఎస్‌ను వీడి హస్తం గూటికి చేరిన ఎమ్మెల్యేల పేర్లనూ పిటిషన్‌లో చేర్చి సుప్రీం కోర్టు తలుపులు తట్టేందుకు గులాబీబాస్‌ కసరత్తులు చేస్తున్నారు. ఇదిలాఉండగా, కాంగ్రెస్‌ కూడా బీఆర్‌ఎస్‌ ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవడంపై సీరియస్‌గా దృష్టి సారించింది. 2019లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని ప్రతిపక్ష హోదా లేకుండా కేసీఆర్‌ చేసినట్టుగానే కాంగ్రెస్‌ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌పెట్టారు. సామదానదండోపాయాలు ప్రయోగించి కారుపార్టీ ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజరుకుమార్‌ కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్న సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌ అధిక స్థానాలను గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే గెలిచింది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌ నేతలకు ఒక్కొక్కరుగా టచ్‌లోకి వెళ్తున్నారు. ఒకటెండ్రు రోజుల్లో వారంతా హస్తంగూటికి చేరబోతున్నారనే ప్రచారమూ జోరుగా సాగుతున్నది. ప్రతిపక్షం లేకుండా పార్టీఫిరాయింపులను ప్రోత్సహించి గతంలో దూకుడు ప్రదర్శించిన బీఆర్‌ఎస్‌ మాదిరిగానే ఇప్పుడు కాంగ్రెస్‌ ముందుకు వెళ్తున్నదనే చర్చ రాజకీయవర్గాలో చర్చనీయాంశమవుతున్నది.
ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదు : కేటీఆర్‌
కాంగ్రెస్‌ ప్రోత్సహిస్తున్న పార్టీ ఫిరాయింపుల అంశంపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌వేదికగా ఘాటుగా స్పందించారు. ‘అధికారంలో ఉన్నామని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజల చేతుల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు. ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తి ఎప్పుడు అధికారంలో ఉన్నవారి కన్నా కూడా బలంగా ఉంటుంది. 2004-06లో కూడా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సార్లు పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది. అప్పుడు కూడా బీఆర్‌ఎస్‌ ఇబ్బందులను ఎదుర్కొంది. ఇలాంటి కష్టసమయం బీఆర్‌ఎస్‌ కు కొత్త కాదు. కానీ, కాంగ్రెస్‌ పార్టీ నీతి లేని వ్యవహారాలపై తెలంగాణ ప్రజలు ఆందోళన ఉధృతమవుతున్నది. ఈ దెబ్బకు కాంగ్రెస్‌ పార్టీ తల వంచక తప్పలేదు. ప్రస్తుతానికి మా పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు పాల్పడేందుకు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి మళ్లీ కచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారు. చరిత్ర పునరావృతమవుతుంది’ అని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ అధిష్టానం కసరత్తులు చేస్తున్నది. ఆ పార్టీ సుప్రీం తలుపులు తట్టేకంటే ముందే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను హస్తం గూటికి చేర్చుకోవడంపై కాంగ్రెస్‌ అధిష్టానం ఫోకస్‌ పెట్టింది. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుల త్రయం ఎత్తులకు పైఎత్తులు వేస్తూ మీరునడిచిన బాటలోనే మేము అన్నట్టుగా బీఆర్‌ఎస్‌ ఎల్పీని విలీనం చేసుకోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌ పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. దానంపై అనర్హత వేటు పడకముందే ఈ ప్రక్రియనంతా పూర్తిచేయాలనే ఆలోచనతో కాంగ్రెస్‌ అగ్రనేతలు కూడా రంగంలోకి దిగారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు గాలం వేస్తూ గులాబీబాస్‌కు షాకులమీద షాకులిస్తూ పోతున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు రంజుగా మారాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ ఎన్నికలకొచ్చేసరికి అసలు ఆ పార్టీలో ఎమ్మెల్యేలుంటారా? వీడుతారా? అన్న చర్చ తీవ్రస్థాయికి చేరుకున్నది. అదికాస్తా నిజమవుతూ ఒక్కో ఎమ్మెల్యే కారుదిగి చేయిపార్టీ చెంతకు చేరుతున్నారు. ఒక్కోరోజు ఒక్కో ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు షాకులమీద షాకులు ఇస్తూపోతున్నారు. పెద్దదిక్కుగా ఉన్న

Spread the love