ఆదివాసీపై హిజ్రాల పాశవిక చర్య

నవతెలంగాణ – మధ్యప్రదేశ్
దేశంలో ధలితులపై పాశవిక చర్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఓ ఆదివాసీ వ్యక్తిపై మూత్రం పోసిన ఘటనను మరువక ముందే యూపీలో అదే తరహా పాశవిక చర్య మరోసారి పునరావృతమైంది. ఐదుగురు హిజ్రాలు ఓ వ్యక్తికి గుండుగీసి అతడిపై మూత్ర విసర్జన చేశారు. అంతటితో ఆగకుండా భౌతిక దాడికి పాల్పడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కోస్‌గంజ్‌ ప్రాంతంలో చోటు చేసుకన్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా యూపీ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు ఐదుగుర్నీ అరెస్టు చేశారు. రెండు హిజ్రా వర్గాల మధ్య విభేదాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. బాధితుడు రఫీకుల్‌ ఓ వర్గానికి చెందిన నాయకురాలి ఇంట్లో వంటవాడిగా పని చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం వ్యక్తిగత పని మీద రఫీకుల్‌ వెళ్తున్న సమయంలో ఐదుగురు హిజ్రాలు అతడిని అడ్డగించి దుర్భాషలాడారు. అతడి దగ్గరున్న రూ.1000 నగదును లాక్కున్నారు. ఆ తర్వాత అతడికి ఒకరు గుండు గీస్తుండగా.. మిగతావారంతా చుట్టూ చేరి వీడియో తీశారు. అతడి ముఖంపైన, నోట్లో మూత్ర విసర్జన చేశారు. అక్కడికి దూరంగా పని చేస్తున్న కొందరు అది గమనించి హిజ్రాల దాడి నుంచి వ్యక్తిని రక్షించారు.  రఫీకుల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూత్రవిసర్జన చేసిన తర్వాత తనను కూడా హిజ్రాగా మార్చేందుకు వాళ్లు ప్రయత్నించారని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. హిజ్రాల పాశవిక చర్యను పలువురు ఖండిస్తున్నారు.

Spread the love