రాజ శ్యామల యాగం నిర్వహించిన బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్

– ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి.
– 108 మంది వేద పండితులతో యాగం నిర్వహణ
– బి ఎస్ పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్
నవతెలంగాణ-సూర్యాపేట రూరల్ : యాగo నిర్వహించేందుకు 108 మంది వేద పండితులు హాజరై‌ శ్రీ రాజశ్యామల మాతంగేశ్వరి అమ్మవారి ప్రతిమను ప్రతిష్టించారు. వేద మంత్ర ఉచ్చరణ తో పాటు మంగళ వాయిద్యాలు నడుమ ఘనంగా పూజలు నిర్వహించారు. పూజలో భాగంగా గోపూజ, గురు ప్రార్ధన, మహా సంకల్పం, గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, ఆచార్యాది రుత్విగ్వరణం, యాగశాల సంస్కారం, సహస్ర మోదక గణపతి హోమం పూజలు నిర్వహించారు.అనంతరం ఆదిత్యాది నవగ్రహ హోమం, నవాక్షరీ మూలమంత్ర జప అనుష్ఠానము, తైలోక్య మోహన గౌరీ హోమం, చండీ సప్తశతి పారాయణములు, చతుర్వేద పారాయణములు, రుద్ర హోమం, శ్రీ రాజ శ్యామల మాతంగేశ్వరి హోమం, మహా పూర్ణాహుతి, వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదములు చేపట్టారు. పూజా కార్యక్రమాలకు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ.. సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలు కలిగి ఉండి, నిండు నూరేళ్లు జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గం ప్రస్తుతం పడుతున్న బాధల నుండి విముక్తి పొందాలని కోరినట్లు పేర్కొన్నారు.అనంతరం వేద పండితులకు వస్త్ర దానం చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు.ఈ కార్యక్రమాలలో కౌన్సిలర్లు గండూరి పావని కృపాకర్, ధరావత్ నీలాబాయి లింగా నాయక్, అన్నేపర్తి రాజేష్, బిఎస్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Spread the love