Saturday, September 12, 2026
E-PAPER
Homeమానవిశ్రద్ధతో నిర్మించండి

శ్రద్ధతో నిర్మించండి

- Advertisement -

“వ్యాపారాన్ని నడపడం, కుటుంబాన్ని చూసుకోవడం ప్రజలు అనుకున్నంత భిన్నమైనవి కావు. రెండింటికీ సహనం, తక్షణ ఫలితాలు ఆశించకుండా దేన్నైనా పోషించే సామర్థ్యం, మీరు నిర్మిస్తున్న దాన్ని రక్షించాలనే సహజ ప్రవృత్తి అవసరం. నేను ప్రారంభించినప్పుడు అవగాహన ఏమీ లేదు. నాకు కేవలం సమయం, ఒక సృజనాత్మక ప్రేరణ, మహిళంటే ఇంటికే పరిమితం కానవసరం లేదని, బహుశా మొదట మీకే మీరు నిరూపించుకోవాలనే తపనతో వచ్చే నిశ్శబ్దమైన పట్టుదల ఉన్నాయి. వ్యాపారంలో నేను తీసుకున్న ప్రతి నిర్ణయం, కుటుంబాన్ని పెంచడంలో నేను పాటించిన విలువల ద్వారానే వచ్చింది. ప్రతిరోజూ పనికి హాజరవ్వడం, నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీ పడకపోవడం, తొందరపాటుతో కాకుండా శ్రద్ధతో నిర్మించడం. తల్లులైన మహిళలకు వ్యాపారంలో అసాధారణమైన ప్రయోజనం ఉంటుందని నేను నమ్ముతాను. మాకు త్యాగం అంటే ఏమిటో తెలుసు, మనకంటే గొప్పదైన దానికి ఎలా ప్రాధాన్యం ఇవ్వాలో మాకు తెలుసు. ఏండ్ల తరబడి కనిపించని, గుర్తించబడని పనులను చేస్తూ అన్నింటినీ కలిపి ఉంచడం వల్ల వచ్చే స్థైర్యం మాకు ఉంది. నేను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాలని బయలుదేరలేదు. అర్థవంతమైన దాన్ని, నా తర్వాత కూడా నిలిచిపోయే దాన్ని సృష్టించాలని బయలుదేరాను’’ అంటూ తన మాటలు ముగించారు.
మీనా బింద్రా, భారతదేశంలోని అతిపెద్ద ఎత్నిక్ వేర్ బ్రాండ్‌లలో ఒకటైన బీబా (BIBA) చైర్‌పర్సన్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -