349కేజీల గంజాయి కాల్చివేత

– గంజాయి, మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా
– పిల్లల కదలికలపై తల్లిదండ్రులు గమనించాలి
– మత్తు పదార్థ రహిత జిల్లాకోసం ప్రతీ ఒక్కరూ సహకరించాలి
– సిద్దిపేట పోలీస్ కమిషనర్ డా.అనురాధ
నవతెలంగాణ – చిన్నకోడూరు
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో 2023-24 సంవత్సరాలలో నమోదైన 14 కేసులలో పట్టుబడిన దాదాపు 349 కిలోల గంజాయిని చిన్నకోడూరు మండల పరిధిలోని మాచాపూర్ గ్రామ శివారులోని ధర్మ అండ్ కంపెనీ బయో మెడికల్ వెస్టేజ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇన్సులేటర్ లో సిపి ఆధ్వర్యంలో కాల్చివేసారు. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధశర్మ మాట్లాడుతూ… సిద్దిపేట జిల్లా లో ప్రత్యేకంగా డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక డాగ్స్ తో బ్లాక్ స్పాట్స్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని, అలాగే ఆన్లైన్ పార్సిల్ తదితర అంశాలపై తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డిసిసి మల్లారెడ్డి, సిద్దిపేట ఏసిపి మధు, సిసిఆర్బి ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఉపేందర్, శ్రీను, విద్యాసాగర్, శ్రీను, రిజర్వ్ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్, చిన్నకోడూరు ఎస్ఐ బాలకృష్ణ, ఎస్ఐలు భాస్కర్ రెడ్డి, మహేష్, తిరుపతి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love