మండుతున్న టమాటా ధరలు

– కిలో రూ.80కి పైనే
ఢిల్లీ: వర్షాకాలం ప్రారంభమై పక్షం రోజులు గడుస్తున్నా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతూనే ఉన్నాయి. దీంతో టమాటా దిగుబడులు భారీగా తగ్గాయి. మార్కెట్లో సరిపడినంత స్టాక్‌ లేకపోవడంతో పలు చోట్ల టమాటా ధరలు మండుతున్నాయి. తీవ్రమైన వేడిగాలుల వల్ల గత ఇరవై రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళలో టమాటా ధరలు రెండింతలు పెరిగి కిలోకు రూ.50కి వద్ద స్థిరపడ్డాయి. తెలంగాణలో కిలో టమాటా ధర రూ.80కిపైగా పలుకు తోంది. సరఫరా కొరతతో జులైలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారవచ్చని తెలుస్తోంది.

Spread the love