అసెంబ్లీ సమావేశాల నాటికి బీఆర్ఎస్..!

 

నవతెలంగాణ హైదరాబాద్: ఎమ్మెల్యేలను కేసీఆర్ ఫామ్ హౌస్ కి పిలిస్తే అందరూ ఢిల్లీకి పోతున్నారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల నాటికి బీఆర్ఎస్ లో బావ బామ్మర్ది తప్ప ఎవ్వరు మిగలరని, తీహార్ జైలులో ఉన్న కవిత సైతం  అప్రోవల్ గా మారబోతున్నారని తెలుస్తుందని ఆయన  అన్నారు. అందుకే హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కవితను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారని, ఇంకా కేసీఆర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు.  మొదటి సారి జ్యూడిషియల్ విచారణ చేయమన్న కేసీఆర్… ఇప్పుడు విచారణకు వెళ్లకుండా తప్పించుకున్నాడని అని ఆయన మండిపడ్డారు. చిన్న అభియోగం కారణంగా  మాజీ ప్రధాని పి.వి. నర్సింహారావు విచారణను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అలాంటిది కేసీఆర్ ఎంత ? తప్పించుకోలేడని ఆయన అన్నారు. అంతేకాకుండా..’7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించాడు కేసీఆర్. తెలంగాణ భవిషత్తును అందకరంలోకి నెట్టిండు. అప్పులు తీర్చుకుంటు ప్రతి నెలా టైం కు జీతాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. 42 లక్షల అర్హత లేని ఎకరాలకు రైతు బంధు వేసిండు కేసీఆర్. ఇప్పుడు సాగుజేసే ప్రతి ఎకరాకు రైతు బంధు వేసిన నాయకుడు రేవంత్ రెడ్డి. అందుకే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ధరణిని అడ్డు పెట్టుకొని వేలకోట్ల భూములను కబ్జా చేసిండ్రు కేసీఆర్ కుటుంబం. మోడీ ప్రధాని కళ్ళలో కళ్లు పెట్టి చూసే ధైర్యం లేదు కేసీఆర్ కు. అందుకే మోడీ రాష్ట్రానికి వస్తే ఆయన ను ఆహ్వానించకుండా అవమానించిండు. రేవంత్ రెడ్డి రాష్ట్ర నిధులకోసం మోడీని కలిసి ప్రత్యేక నిధులను చేస్తున్నారు. కేసీఆర్ ఇప్పటికైనా నిర్ణయాత్మక మైన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే మంచిది.’ అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Spread the love