రంగాపూర్ కోట కాలువ బైపరిగేషన్ పనులు వెంటనే పూర్తి చేయాలి..

– ఆయకట్టు రైతులు
నవతెలంగాణ-గోవిందరావుపేట :
రంగాపురం కోట కాలువరిగేషన్ మరమత్తు పనులు వెంటనే పూర్తి చేయాలని కోట కాలువ ఆయకట్టు రైతులు కోరుకుంటున్నారు. గురువారం బైపరిగేషన్ ప్రాంతం పరిశీలించిన రైతులు ఈ సందర్భంగా మాట్లాడారు. కాలువ మరమ్మత్తుల కోసం 39 లక్షల రూపాయలు మంజూరి వచ్చి సంవత్సరం దగ్గర పడుతున్న ఇప్పటివరకు పనులను ప్రారంభించకపోవడం దురదృష్టకరమని అన్నారు. సంబంధిత గుత్తేదారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే గత మార్చి నుండి పనులు చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. కోట కాలువ తైబందీ ప్రకటించిన రోజున జనవరి 10వ తారీఖున కోట కాలువకు నీటిని విడుదల చేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు ప్రకటించడం జరిగిందని అన్నారు. నేడు 11వ తారీకు అయినప్పటికీని నీటి విడుదలకు జాడేలేదని అధికారుల ఆచూకీ లేదని రైతులు అన్నారు. వరంగల్లు జిల్లా కేంద్రానికి పరిమితమైన అధికారులు ఆయకట్టును కాలువలను చెరువును పట్టించుకోవడంలో అలసత్వం వహిస్తున్నారని అన్నారు. రంగాపురం కాలువ తూములను ఇప్పటివరకు మూయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని రైతులు అంటున్నారు. రైతులే రంగాపురం కాలువ తూములను పూడ్చివేయాలనడంలో అర్థం లేదని,39  లక్షల రూపాయల పనులు ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గుత్తేదారుపై చర్యలు చేపట్టకుండా రైతులను సొంత ఖర్చులతో కాలువను పోర్చుకోవాలనడం ఎంతవరకు సమంజసమని అన్నారు. కోట కాలువ కింద ఇప్పటివరకు రైతులు నారున పోసుకోకుండా ఇబ్బందులు పడుతున్నారని రైతుల ఇబ్బందులను గుర్తించి అధికారులు వెంటనే స్పందించి సంబంధిత గుత్తేదారుతో రంగాపురం కాలువ తూములను ఊహించి కోట కాలువకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
Spread the love