‘వాట్సప్ ద్వారా వ్యాపారం’ భాగస్వామ్యాన్ని విస్తరించిన సీఏఐటీ, మెటా

వాట్సప్ ద్వారా వ్యాపారం
వాట్సప్ ద్వారా వ్యాపారం
  • ఈ భాగస్వామ్యం 17 నగరాలకు చెందిన 1 మిలియన్ వ్యాపారుల నుంచి 29 రాష్ట్రాలకు చెందిన 10 మిలియన్ల వ్యాపారులకు నైపుణ్యాన్ని పెంపొందించే ప్రారంభ లక్ష్యం

  • ఈ కార్యక్రమం భారతదేశంలోని వ్యాపారుల కోసం 11 భారతీయ భాషలలో శిక్షణను అందిస్తుంది

నవతెలంగాణ హైదరాబాద్: దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారాలకు సాధికారత కల్పించే ప్రయత్నంలో, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT), మెటా (Meta) తమ ‘వాట్సప్ సే వ్యాపార్’ కార్యక్రమాన్ని వాట్సప్ బిజినెస్ యాప్‌లో 10 మిలియన్ల స్థానిక వ్యాపారులకు డిజిటల్‌గా శిక్షణ ఇచ్చేందుకు, నైపుణ్యాన్ని వృద్ధి చేసేందుకు విస్తరిస్తున్నాయి. దేశంలోని 29 రాష్ట్రాలలో 11 భారతీయ భాషలలో హైపర్-లోకల్ డిజిటల్ శిక్షణలతో వ్యాపారాల కోసం వృద్ధి అవకాశాలను ఆవిష్కరించేందుకు డిజిటలైజేషన్ ప్రయత్నాలను స్థానికీకరించడమే ఈ భాగస్వామ్యం కీలక లక్ష్యం.  భారతదేశం వ్యాప్తంగా 40,000 వర్తక సంఘాలు మరియు 80 మిలియన్ల వ్యాపారుల విస్తృత నెట్‌వర్క్‌తో, అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (CAIT) వారి దుకాణాలను సమగ్రంగా డిజిటలైజ్ చేయడం, వాట్సాప్‌లో వారి ‘డిజిటల్ దుకాణాన్ని’ నిర్మించుకోవడంలో సహాయపడుందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందిస్తుంది. చిన్న వ్యాపారాలు తమ వినియోగదారులతో సమర్ధవంతంగా అనుసంధానం అయ్యేందుకు అనుగుణంగా వ్యాపారులను ఈ దిశలో సన్నద్ధం చేసేందుకు సమగ్ర డిజిటల్ మరియు నైపుణ్య శిక్షణను అందించేందుకు రూపొందించిన వర్క్‌షాప్‌ల శ్రేణిని నిర్వహిస్తుంది.
పలు సంవత్సరాలుగా, వాట్సప్ బిజినెస్ యాప్ భారతదేశంలోని సూక్ష్మ, చిన్న వ్యాపారాలు మరియు సోలోప్రెన్యూర్‌ల వ్యాపారం కోసం ప్రొఫెషనల్ డిజిటల్ గుర్తింపును నిర్మించడంతో పాటు కొత్త మార్కెట్‌లను కనుగొనేందుకు మరియు వారి వినియోగదారులకు సేవ చేసేందుకు డెమక్రటిక్ గేట్‌వేని అందించింది. భారతదేశ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి సాంకేతిక లివర్లను స్వీకరించడం, తద్వారా  కొత్త తరం వినియోగదారుల అవసరాలకు వితరణ చేసేందుకు వీలు కల్పించడం ద్వారా అభివృద్ధి చెందుతున్న వర్తక సంఘాన్ని బలోపేతం చేయడంలో ఈ భాగస్వామ్యం మరొక అడుగు. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (CAIT) జాతీయ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ మాట్లాడుతూ, “వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపార అవసరాలతో, సాంకేతికత వృద్ధికి గణనీయమైన అవసరం ఉంది. తమను తాము వృద్ధి చేసుకునేందుకు సరైన సాధనాలతో, భారతదేశంలోని వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు కొత్త మార్గాలను నేర్చుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చని మేము విశ్వసిస్తున్నాము. వాట్సాప్ బిజినెస్ యాప్ అందించే చేరువ మరియు విజయం అసమానమైనవి. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో 10 మిలియన్ల వ్యాపారులకు నైపుణ్యాన్ని పెంచేందుకు రూపొందించిన ‘వాట్సప్ సే వ్యాపార్’ కార్యక్రమంలో మెటాతో మా భాగస్వామ్యాన్ని విస్తరించుకుంటున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ భాగస్వామ్యం వ్యాపారులు మరియు వ్యాపారాలు మరింత సమగ్రమైన కస్టమర్ బేస్‌ను నిర్మించుకునేందుకు, వారి వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు మరియు భారతదేశంలో పెరుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మరింత సహకారం అందించడంలో సహాయపడుతుంది’’ అని వివరించారు.
మెటా గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ మాట్లాడుతూ, “ఇది భారతదేశంలో ఎంటర్‌ప్యూనర్‌షిప్ యుగం. భారతదేశం డిజిటల్ విప్లవాన్ని కొనసాగిస్తోంది. భారతీయ పారిశ్రామికవేత్తలు, చిన్న వ్యాపారాలు వాట్సప్ వంటి సాంకేతికతలను స్వీకరించిన విధానం దానిలో మేము కీలక పాత్రను పోషిస్తున్నాము. మేము వ్యాపారవేత్తలు, చిన్న వ్యాపారాలకు ముందున్న అవకాశాలను ఎక్కువగా ఉపయోగించుకునేందుకు సహాయపడుతూ, భారతదేశం టేకేడ్ హృదయంలో కొనసాగాలని కోరుకుంటున్నాము’’ అని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం మెటా స్మాల్ బిజినెస్ అకాడమీకి 25,000 మంది వ్యాపారులకు యాక్సెస్ ఇవ్వడం ద్వారా ట్రేడింగ్ కమ్యూనిటీ కోసం అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (CAIT) డిజిటల్ స్కిల్లింగ్ చార్టర్‌ను వేగవంతం చేస్తుంది. మెటా స్మాల్ బిజినెస్ అకాడెమీ ధృవీకరణ ముఖ్యంగా కొత్త ఎంటర్‌ప్యూనర్లు మరియు విక్రయదారులు మెటా యాప్‌లలో వృద్ధి చెందేందుకు క్లిష్టమైన డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలను పొందడంలో సహాయపడుతుంది. భారతదేశం వ్యాప్తంగా చిన్న, మధ్యతరహా సంస్థలను (MSME) చేరుకుని ప్రోగ్రామ్‌ను ప్రారంభించుందకు, కోర్సు మాడ్యూల్, పరీక్ష ఏడు భాషలు ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, బెంగాలీ, కన్నడ, తమిళం, తెలుగులలో అందుబాటులో ఉన్నాయి.

Spread the love