ఒంటెద్దు పోకడతో పోతున్న కేంద్రం

– ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్‌
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్‌
కుత్బుల్లాపూర్‌లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద తెలంగాణ లారీ డ్రైవర్స్‌ అసోసియేషన్‌ ఐడీపీఎల్‌ చింతల్‌ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను శనివారం కలిశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయ సంహిత 106/2 – న×ు aఅస =ఖచీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ లారీ డ్రైవర్లు తలపెట్టిన బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదవాడి పొట్టకొడుతూ కార్పొరేట్లకు దోచిపెట్టే విధంగా ఒంటెద్దు పోకడలకు పోతుందన్నారు. ఈ విధానాలతో పేద ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇటువంటి అసంబద్ధ చట్టాలను రద్దు చేసే వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లారీ డ్రైవర్స్‌ అసోసియేషన్‌ – బీఆర్‌టీయూ కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ అధ్యక్షులు ఇస్మాయిల్‌, ఉపాధ్యక్షులు ఎండి.చాంద్‌ పాషా, ఎండి.సయ్యద్‌ అసద్‌, ప్రధాన కార్యదర్శి ఆర్‌.వినోద్‌ కుమార్‌, సంయుక్త కార్యదర్శిలు డి.ఎల్లా కుమార్‌, మసూం సయీద్‌, సభ్యులు గోండ్‌ శివాజీ, ఎండీ.గౌస్‌ పాల్గొన్నారు.

Spread the love