యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకుల మానవహారం…

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ  మెయిన్ గేట్ జాతీయ రహదారి వద్ద శనివారం రాష్ట్ర జాక్ పిలుపు మేరకు మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వి దత్త హరి ని రాష్ట్ర జాక్ కో కన్వీనర్ గా నియమించడం జరిగిందని వారన్నారు. నిరంతరం పోరాట మూలంగా జాక్ లో కో కన్వీనర్ పోస్టు వరించిందని, ఇదే కాకుండా యూనివర్సిటీ నుండి ఇద్దరికీ జాక్ లో స్థానం కల్పించడం హర్షించదగ్గ విషయ మన్నారు. తెలంగాణ యూనివర్సిటీ నుండి గంగా కిషన్, మెయిన్ క్యాంపస్ నుండి నారాయణ గుప్తా సౌత్ క్యాంపస్ వీరికి స్థానం లభించిందన్నారు. రాష్ట్రంలో 1335 మందిని రెగ్యులరైజ్ చేయాలని ఏకైక డిమాండ్ తో మానవహారం మెయిన్ గేట్ ముందు నిర్వహించామని, తెలంగాణ రాష్ట్రంలో 12 యూనివర్సిటీ లలో పనిచేస్తున్న 1335 మందిని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులరేషన్ చేయాలని కాంటాక్ట్ జాక్ రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ వి దత్త హరి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ శతాబ్ది ఉత్సవాల వేడుకలు సందర్భంగా యూనివర్సిటీ కాంటాక్ట్ అధ్యాపకులను కుటుంబాలను వెలుగు నింపి తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు ముఖ్య మంత్రి కేసీఆర్ పునాది వేయాలన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులైజేషన్ చేసి మిగిలిన అధ్యాపకులను నియామకాలు చేపట్టి ఉన్నత విద్యకు తోడ్పడాలన్నారు. ముఖ్యమంత్రి కేజీ టు పీజీ విద్యలో భాగంగా తమను వెంటనే రెగ్యులైజేషన్ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు ఈ కార్యక్రమంలో టియు కాంట్రాక్ట్ అధ్యాపకులు నాగేశ్వరరావు, దేవరాజు శ్రీనివాస్, జలంధర్, గంగ కిషన్, జి శ్రీనివాస్, కిరణ్ రాథోడ్, డాక్టర్ బి.ఆర్ నేత, మోహన్, జోష్ణ, స్వామి, పురుషోత్తం, రాజేశ్వర్, ఆనంద్, సందీప్, శ్రీనివాస్, శ్వేతా, నర్సింలు, నర్సయ్య, నాగేంద్రబాబు, సురేష్, నర్సయ్య, ప్రవీణ్, గంగాధర్, గోపి రాజ్ తోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Spread the love