నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్
పరిసరాల పరిశుభ్రతతో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకునేల జాగ్రత్తలు తీసుకోవాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని 4,వ వార్డ్ లో కళాజాత ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పరిశుభ్రత, పచ్చదనంపై పాటల రూపంలో వార్డులో ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అనిత, పట్టణ అధ్యక్షుడు ఎం.డి అన్వర్, యండి అయూబ్ కో ఆప్షన్ సభ్యులు, మెతుకు కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.