Sunday, May 10, 2026
E-PAPER
Homeజాతీయం5 వేల మంది నిరుద్యోగులపై కేసులు

5 వేల మంది నిరుద్యోగులపై కేసులు

- Advertisement -

నలుగురి అరెస్టు
బీహార్‌లో బీజేపీ సర్కారు దుర్మార్గం

పాట్నా : బీహార్‌లోని బీజేపీ సర్కారు సకాలంలో రిక్రూట్‌మెంట్‌ నిర్వహించి ఉద్యోగాలి వ్వకపోగా, ఆందోళన చేసిన నిరుద్యోగులపై కేసులు పెట్టి, నలుగురిని అరెస్టులు చేసి వేధి స్తోంది.46,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేం దుకు ఉద్దేశించిన బీహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (బీపీఎస్‌సీి) ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌ఈ-4) నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ నెలలో విడు దల కావాల్సి ఉంది. నోటిఫికేషన్‌ విడుదల కాకపో వడంతో విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. బీపీఎస్‌సీ టీఆర్‌ఈ-4 పరీక్ష ప్రకటనలో జాప్యానికి నిరసనగా ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళనకు సంబంధించి 5,000 మందికి పైగా పోలీసులు కేసులు నమోదు చేశారు. నలుగురిని అరెస్టు చేశారు.

బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీలతో చితకబా దారు. దీంతో, పలువురు నిరుద్యోగులు గాయాల పాలయ్యారు. ఈ అంశంపై సిటీ సెంట్రల్‌ ఎస్పీ దీక్ష మాట్లాడుతూ నిరసన సమయంలో కొందరు నిరసనకారులతోపాటు పోలీసులు గాయపడ్డారని చెప్పారు. నలుగురు నిరసనకారులను అరెస్టు చేశా మని, మిగిలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు గుర్తిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర రాజధానిలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు చాలా సేపటి వరకు అంతరాయం ఏర్పడిందని, దీంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

ప్రభుత్వ తీరుపై సర్వత్రా ఆగ్రహం
విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకపోగా, వారిపై కేసులు పెట్టడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యమాలు చేసినప్పుడు ట్రాఫిక్‌కు అంతరాయం కలగడం సహజం.ఇటీవల ముంబైలో డీలిమిటేషన్‌తో ముడిపెట్టిన మహిళా బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకో వడాన్ని నిరసిస్తూ బీజేపీకి చెందిన మంత్రి చేప ట్టిన ఆందోళనతో కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయి, తన చిన్నారికి ఏం జరుగుతుందో నన్న ఆందోళనతో ఓ తల్లి నిలదీసిన సంగతి తెలిసిందే. చివరికి ఆమెపైనే అక్కడి బీజేపీ సర్కారు కేసు పెట్టింది. ట్రాఫిక్‌ నిలిచిపోవడానికి కారణమైన మంత్రి, బీజేపీ కార్యకర్తలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా, విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్లపై ఆందోళన చేస్తే వారిపైనే కేసులు పెట్టి వేధించడం శోచనీయమని విద్యార్థి, యువజన సంఘాలు పేర్కొంటున్నాయి. ఉద్యోగార్థుల న్యాయమైన డిమాండ్లను వినకుండా వారిపై దారుణంగా లాఠీఛార్జి చేసి, కేసులు పెడుతున్నారని ఆర్‌జేడీ ప్రతినిధి ఎజాజ్‌ అహ్మద్‌ విమర్శించారు. ఉద్యోగాలివ్వాలని ఆందోళన చేయడం నేరంలాగా, వీడియో ఫుటేజి ఆధారంగా నిరసనకారుల కోసం గాలిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -