నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
వాహనాల్లో పరిమితికి మంచి లోడ్‌ను అంగీకరించరాదని రాష్ట్ర రవాణా శాఖ ఆదేశాలు జారీచేసింది. సరుకు, ఖనిజాల లోడింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆయా లోడింగ్ పాయింట్ల ఇన్‌ఛార్జిలు, మైనింగ్ అధికారులకు రవాణా శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది క్వారీలు, కంపెనీలు, లోడింగ్ స్థావరాల వద్ద వాహనాలకు అనుమతించిన పరిమితికి మించి సరుకులు, ఖనిజాలను నింపుతున్నారని అభ్యంతరంవ్యక్తం చేసింది. గుర్తు చేసింది. అధిక బరువులకు వే బిల్లులు, ట్రాన్సిట్ రసీదులు జారీ చేస్తున్నారనే సంగతికి ఇటీవల జరిపిన ప్రత్యేక తనిఖీలలో రవాణా శాఖ పసిగట్టింది . ఈ విధంగా చేయడం మోటారు వాహనాల చట్టం 1988, మైనింగ్ నిబంధనలకు ఉల్లంఘించడమేననీ, సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు విరుద్దంగా వ్యవహరించడమేనని తెలియజేసింది. మోటారు వాహనాల చట్టం 1988, సెక్షన్ 113 ప్రకారం, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో పేర్కొన్న గ్రాస్ వెహికల్ వెయిట్ (జీవీడబ్ల్బూ)కు మించి ఏవాహనాన్ని కూడా నడపడం లేదా నడిపించడానికి అనుమతించడం నేరమని పేర్కొన్నది. ఓవర్ లోడ్ వాహనాలను అనుమతించడం, నడపడం సెక్షన్ 194 కింద శిక్షార్హమైన నేరమని ఆదేశాల్లో స్పష్టం చేసింది. సెక్షన్ 199 కూడా ఇదే విషయాన్ని చెబుతుందని వివరించారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో అనుమతించిన జీవీడబ్ల్యూవీ ప్రకారమే వాహనాల్లో సరుకులు, ఇతరాలు లోడ్ చేయాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించిన యజమానులు, బాధ్యులపై నేరుగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి విలుందని పేర్కొన్నది. మైనింగ్ అధికారులకు ప్రత్యేక సూచనలు చేసింది. ఈ మేరకు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్‌పోర్టు, మైనింగ్ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. సంబంధిత నివేదికలు వెంటనే రవాణా కమిషనర్ కార్యాలయానికి వెంటనే సమర్పించాలని రాష్ట్ర రవాణా శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఓవర్ లోడ్ చేస్తే కేసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



