Wednesday, September 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపీసీసీ చీఫ్‌‌ను కలిసినఐఎన్‌‌టీ యూసీ నేతలు

పీసీసీ చీఫ్‌‌ను కలిసినఐఎన్‌‌టీ యూసీ నేతలు

- Advertisement -

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌‌తోపాటు ఐఎన్‌‌టీయూసీ జాతీయ అధ్యక్ష‍ులు డాక్టర్ జి సంజీవరెడ్డిని కలిసి ఐఎన్‌‌టీయూసీ ఎస్‌‌డబ్ల్యూయూ నాయకులు కలిసి చెప్పారు. ప్రభుత్వంతో అపాయింటెడ్‌ తేదీని ప్రకటింపజేయాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు కోసం రూ. 300 కోట్లకుగాను రూ. 50 కోట్లను తొలుత ఆర్టీసీకి ఇవ్వాలని సూచించారు. సర్కారు జీవో ప్రకారం ఆర్టీసీలో అవుట్‌‌సోర్సింగ్‌ ఉద్యోగులు సమస్యలు పరష్కరించాలని కోరారు. ఆర్టీసీ కార్మకుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోవాలని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్ష‍ులు మొగుళ్ల రాజు రెడ్డి , ఐఎన్‌‌టీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్డీ చంద్రశేఖర్ , ఆదిల్ షరీఫ్ . పాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -