Saturday, May 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బి కే పల్లిలో సీసీ కెమెరాలు ఏర్పాటు 

బి కే పల్లిలో సీసీ కెమెరాలు ఏర్పాటు 

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు 
మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో మెయిన్ రోడ్డుపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ తెలిపాడు. శనివారం వార్డు సభ్యులతో కలిసి సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో మెయిన్ రోడ్డుపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. దీంతోపాటు ఇంకా ఏడు సీసీ కెమెరాలు గ్రామంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక నుంచి నిఘా నీడలో గ్రామం ఉంటుందని, తద్వారా ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుందన్నారు. అంతేకాదు దొంగతనాలు కూడా జరిగే ఆస్కారమే లేదని తెలిపారు.

ఒక సీసీ కెమెరా వందల నిఘా నేత్రాలకు సమానమని అన్నారు. ఈ గ్రామాన్ని ఇప్పటికే ఎంతో అభివృద్ధి పథంలో దూసుకెళ్లే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ప్రజలకు కావాల్సిన వసతులను కలిగించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ గ్రామాన్ని రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దేందుకు మా వంతు కృషి చేస్తున్నామని, దీనికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ప్రభుత్వం, అధికారులు మాకు సహకరించి గ్రామాభివృద్ధికి పూర్తిస్థాయిలో చేయూత ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు బొల్లు మురళి జెల్లా పరుశరాములు, నాయకులు కారం ప్రశాంత్, తాళ్ల రాంరెడ్డి, బొమ్మన బోయిన వీరన్న, బొల్లు అశోక్, జల్ల సోమయ్య, ఏర్పుల రాములు, బెజ్జం రవి, పిడుగు యాదగిరి, గుగులోతు సర్వంన్ ఆశోద ప్రవీణ్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -