ఘనంగా రైతు దినోత్సవ సంబురాలు

నవతెలంగాణ-వట్‌పల్లి
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతుక్లస్టర్‌ గ్రామాల్లో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అశోక్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి అధ్యక్షతన శనివారం రైతు సంబురాలను ఘనంగా నిర్వహించారు. కొబ్బరి మట్టలు, మెరుపు కాగితాలతో ఎడ్ల బండ్లను అందం గా అలంకరించి క్లస్టర్‌ పరిధిలోని గ్రామాల్లో నుంచి ఊరే గింపుతో డప్పుచప్పుళ్ల మధ్య గ్రామ కేంద్రం వరకు ఉరేగింపు చేశారు. అనంతరం క్లస్టర్‌ కేంద్రంలో ఏర్పాటుచేసిన సమా వేశంలో ప్రత్యేక అధికారులు దశాబ్ది ఉత్సవాల గురించి రైతు లకు వివరించారు. అదేవిధంగా వట్‌పల్లిలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించి.. దేనూనూర్‌ క్లస్టర్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లా డారు. బీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టిన ఈ పదేండ్ల కాలంలో రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధించిందన్నారు. రైతుల సంక్షేవ ూనికి ఎల్లవేళలా కృషి చేస్తున్నామన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారన్నారు. అందులో భాగంగా చేపట్టిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు లాంటి పథకాలు నేడు ఇతర రాష్ట్రాల్లోనూ కాపీ కొడుతున్నారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతుల సమన్వయంతో రైతు సంబరాలను జరుపుకోవడం తృప్తిగా ఉనదన్నారు. ఈ కార్యక్రమాలలో జెడ్పీటీసీ పత్రి అపర్ణ, ఎంపీపీ పత్రి కృష్ణవేణి, మండల ఎంపీటీసీల ఫోరమ్‌ అధ్యక్షుడు నర్సింలు, ఏఈవోలు, కార్యదర్శులు, ఎంపీటీసీలు, సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love