ఘనంగా గౌతమ బుద్ధుడి జయంతి వేడుకలు..

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని హాసకొత్తూర్ గ్రామంలోని మాల సంఘం ఆధ్వర్యంలో గురువారం బుద్ధ పౌర్ణమి, మహా జ్ఞాని తథాగత్ గౌతమ బుద్ధుడి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన, బుద్ధ వందనం, పంచాశిలా, త్రిశరణ పాటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సుంకరి విజయ్ మాట్లాడుతూ… ఈ వైశాఖ పౌర్ణమి బౌద్ధంలో చాలా ప్రాధాన్యత కలిగిన రోజన్నారు. బుద్ధుడు జన్మించిన రోజు, జ్ఞానోదయం పొందిన రోజు, పరినిర్వాణం చెందిన రోజు, ఈ మూడు చారిత్రిక సంఘటనలు జరిగినది వైశాఖ పౌర్ణమి రోజే అని తెలిపారు. మహాజ్ఞాని తథాగత్ గౌతమ బుద్ధుడు విశ్వజ్ఞాన సంపన్నుడు, సకల జీవరాశి ప్రేమికుడు, అహింస సిద్ధాంత ప్రబోధకుడని అన్నారు. ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది ఆ దుఃఖానికి  కోరికలే కారణమని పంచాశిలా సూత్రాలను, అష్టాంగ మార్గాలను ప్రయోగించి శీలమును, నైతికతను బోధించిన మహా ప్రబోధకుడు, స్వేచ్ఛ స్వతంత్రం సౌబ్రాతత్వం న్యాయం, శీలం, కరుణ, ప్రేమ మొదలగు గుణాల నిర్మాణం ప్రపంచంలో బుద్ధుని జ్ఞాన భావజాలం నుండి పురుడుపోసుకున్నాయన్నారు. భారత దేశంలో పుట్టి  సమస్త మానవాళికి శాంతి మార్గం చూపిన మహా మహాజ్ఞాని తథాగత్ గౌతమ బుద్ధుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షులు దేవి హరీష్, కార్యవర్గ సభ్యులు తలారి రమేష్, దేవి శంకర్, మాజీ సర్పంచి బక్కూరి గోపి, శ్రీనివాస్, రంజిత్, శేఖర్, క్రాంతి, తలారి, ప్రసాద్, అశోక్, శ్రీధర్, శేఖర్, లిఖిత, కళావతి, లక్ష్మీ, బాలమణి, తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Spread the love