
నవతెలంగాణ- తాడ్వాయి : మండలంలోని మేడారంలో వనదేవతలను సోమవారం ప్రముఖులు దర్శించుకున్నారు. వరంగల్ జిల్లా జడ్జి సంధ్య, స్థానిక తాసిల్దార్ తోట రవీందర్, ఎండోమెంట్ ఈవో రాజేంద్రం, కన్నెపెల్లి సారులమ్మ పూజారులు కాక కిరణ్, సమ్మక్క ప్రధాన పూజారులు సిద్ధబోయిన స్వామి, వసంతరావు లు
సకుటుంబ, బంధుమిత్రుల సపరివారంతో వనదేవతలను దర్శించుకున్నారు. పూజారులు ఎండోమెంట్ అధికారులు డోలు వాయిద్యాలతో ఆలయ సంప్రదాయాల ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీర సారే సమర్పించి ప్రత్యేకముక్కులు చెల్లించారు. అనంతరం మేడారంలోని అడవి ప్రాంతంలోని కంక వనంలో కి విందు భోజనాలకు వెళ్లారు.
ఈ కార్యక్రమంలో పూజారులు సిద్ధబోయిన రానా రమేష్, మునీందర్, కొక్కెర రమేష్, పూర్ణచందర్, జనార్ధన్, అభ్యుదయ సంఘం అధ్యక్షుడు అధ్యక్షుడు సిద్ధబోయిన బోజారావు, ఎండోమెంట్ అధికారులు క్రాంతి, జగదీశ్వర్, మధు, బాలకృష్ణ, రాజేశ్వరరావు, కొప్పుల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

