ఉపాధి హామీ కూలీల పట్ల వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం

– జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ పోరిక గోవింద్‌ నాయక్‌
నవతెలంగాణ – ములుగు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చె విధంగా కూలీల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపు తుందని అలాంటి ఆలోచన విధాన్ననీ మార్చుకోవాలని లేని యెడల ఉపాధి హామీ కూలీల పక్షాణ వారికి న్యాయం జరగడం కోసం ధర్నా రాస్తారోకో చేయడానికైనా వెనుకాడెది లేదని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ పోరిక గోవింద్‌ నాయక్‌ అన్నారు.బుదవారం కొడిశల కుంట గ్రామ పరిధిలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం యొక్క పనులను పరిశీలించి ఉపాధి హామీ కూలీలతో ముచ్చటిం చారు.ఈ సంధర్బంగా కూలీలు మాట్లాడుతూ గత సంవత్సరం చేసిన పనులకు భిన్నంగా ఇపుడు పనులు ఉన్నాయని, అయినా కూడా కుటుంబ పోషణ కొరకు ఉపాధి హామీ పనులు చేస్తుంటే సరియైన సమయంలో డబ్బులు రాక ఇభందులు పడుతున్నామని, పని చేసే క్రమంలో పని చేసే క్రమంలో అలాంటి గత ఏడాది గడ్డపార, టెంట్‌, మంచి నీళ్ళు వసతి ఉండేదని గుర్తు చేశారు. కానీ ఈ సంవత్సరం కూలీల పట్ల వివక్ష ధోరణి అవలంబిస్తూ,ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వారి గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అంచెలంచెలుగా నీరుగారుస్తు ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే డబ్బులు సరైన సమయంలో రాక ఇభందులకు గురి చేస్తోందిని అంతేకాకుండా పనిచేసే చోట మౌళిక సదుపాయాలు సైతం తొలగించి కూలీల పట్ల వివక్ష ధోరణి అవలంభిస్తోందని అన్నారు. ఇకనైనా కూలీల పట్ల వివక్ష ధోరణి మానుకోవాలని సూచిస్తూ లేని యెడల ఉపాధి హామీ కూలీల పక్షాణ ఎలాంటి పోరాటం చేయటానికి వెనుకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Spread the love