చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల..

నవతెలంగాణ హైదరాబాద్: రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ(TDP) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆరోగ్యంపై రాజమండ్రి సెంట్రల్ జైలు (Jail officials) సూపరింటెండెంట్ రాహుల్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. చంద్రబాబుకు రాజమండ్రి ప్రభుత్వ డాక్టర్ల బృందం 9 రకాల వైద్య పరీక్షలు చేసినట్టు హెల్త్ బులిటెన్‌లో జైలు అధికారులు పేర్కొన్నారు. 20, 21 తేదీల్లో జైలు అధికారులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో చంద్రబాబు బరువును వెల్లడించలేదు. డాక్టర్లు ఇచ్చిన వైద్య నివేదిక ప్రకారం ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జైలు అధికారులు తెలిపారు.

 

Spread the love