చంద్రాయన్ 3 విజయోత్సవ సంబరాలు

నవతెలంగాణ -పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలోని యువకులు చంద్రాయన్-3  విజయ వంతం పై హర్షం వ్యక్త చేస్తూ గాంధీ చౌక్ లో టపాసులు కాల్చుతు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ చంద్రాయన్ 3 అంతరిక్షంలో జాబిల్లి పై ఇప్పటి వరకు ఏ దేశం దిగని దక్షణ ధ్రువం పై విక్రం ల్యాండర్ కాలు మోపడం భారత దేశానికె గర్వకారణంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
Spread the love