బడి పనివేళల్లో మార్పులు

పాఠశాలల పనివేళల్లో మార్పులు
పాఠశాలల పనివేళల్లో మార్పులు

నవతెలంగాణ హైదరాబాద్‌: తెలంగాణలో పాఠశాలల పనివేళల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభమయ్యేలా మార్పులు తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం.. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు  పనిచేయనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా పాఠశాలల పనివేళల్లో మార్పులు చేసినట్టు విద్యా శాఖ ఉత్తర్వుల్లో తెలిపింది. అయితే జంట నగరాల (హైదరాబాద్‌-సికింద్రాబాద్) పరిధిలోని పాఠశాలలకు మాత్రం ఈ ఉత్తర్వులు వర్తించవని పేర్కొంది.

Spread the love