జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో పూర్తిగా ఫీజు మినహాహింపు ఇవ్వాలి

– తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలూరి శ్రీను
నవతెలంగాణ – ఉప్పునుంతల 
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థలలో పూర్తిగా ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు రామచంద్రం,  జిల్లా ప్రధాన కార్యదర్శి కాలూరి శ్రీను లు డిమాండ్ చేశారు.  జిల్లా డీఈవో  ఇచ్చే కన్సెషన్ లెటర్లు కొన్ని ప్రవేటు పాఠశాల యాజమాన్యం ఆమోదించడం లేదు. జర్నలిస్టులకు  ఇవ్వలేమని యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. దీంతో చేసేదేం లేక పూర్తి ఫీజు చెల్లిస్తున్నారు. వచ్చిరాని లైన్  అకౌంట్లు , చాలి చాలని జీతాలతో జీవితాన్ని నెట్టుకొచ్చే జర్నలిస్టులు  పిల్లల ఫీజులు, పుస్తకాలు, బట్టలు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇచ్చే విషయం పైన జిల్లా కలెక్టర్ , జిల్లా విద్యాధికారి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి పూర్తి రాయితీ  కల్పించే విధంగా కఠినంగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా అచ్చంపేట పట్టణంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు జిల్లా విద్యాశాఖ అధికారి ఇచ్చిన రాయితీ లెటర్ ను పట్టించుకోవడం లేదన్నారు. ఇదే పరిస్థితి కొల్లాపూర్, కల్వకుర్తి,  నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో కూడా ఉందన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో జిల్లా విద్యా అధికారి సమావేశం నిర్వహించినప్పుడు ప్రత్యేకంగా జర్నలిస్టుల పిల్లల ఫీజు రాయితీ విషయంపై చర్చించాలని వారు డిమాండ్ చేశారు.
Spread the love