నవతెలంగాణ- కంఠేశ్వర్: బాలల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ లోని ఫులాంగ్ లోగల గవర్నమెంట్ ( రెడ్ క్రాస్ దత్తత ) పాఠశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఘనంగా మంగళవారం నిర్వహించారు. నవంబర్ 14వ తేదీని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం, అందుకే మనం చాచా నెహ్రూ జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటామని. నేటి బాలలే రేపటి పౌరులు. మనదేశ భవితవ్యం బాలల మీద ఆధారపడి వుంది. వీరే గనుక సరైన మార్గంలో పయనిస్తే మన దేశ కీర్తి పతాకాపు రెపరెపలు ప్రపంచానికి కనిపిస్తాయి. ప్రపంచంలోనే అత్యున్నత స్థానం మనకు లభిస్తుందని రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స అంజనేయులు ఈ సందర్భంగా సందేశం ఇచ్చారు. తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, రెడ్ క్రాస్ కోశాధికారి కరిపే రవీందర్, అసిస్టెంట్ సెక్రటరీ పోచయ్య, పి.ఆర్.ఓ బి.రామకృష్ణ ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు అధ్యాపక బృందం పాల్గొన్నారు.