పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: సిఐ సతీష్

నవతెలంగాణ- నవీపేట్: వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ సతీష్ అన్నారు. మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక మండపాల నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. ప్రతి సంవత్సరం లాగే మతసామరస్యంతో వ్యవహరించి వినాయక నిమజ్జనంలో ఎటువంటి అపశృతులు జరగకుండా చూసుకోవాలని ఏవైనా సమస్యలు ఉంటే పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని అన్నారు. రెవెన్యూ, పంచాయతీ, ఆర్ అండ్ బి మరియు ట్రాన్స్కో శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రోడ్లు అద్వానంగా ఉన్నాయని ఆర్ అండ్ బి శాఖ అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిమజ్జన అనంతరం లోటుపాట్లపై రివ్యూ మీటింగ్ జరుపుకోవాలని తమ్మల కృష్ణ అన్నారు. దుర్గామాత నిమజ్జనంలో బాసర గోదావరి ప్రభుత్వ యంత్రాంగం వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేయడం లేదని నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ధన్వాల్, ఎంపీడీవో సాజిద్ అలీ, సొసైటీ చైర్మన్ అబ్బన్న, బుచ్చన్న, తాహెర్, నవీన్ రాజ్, రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love