రేపటి పౌరులు తయారు అయ్యేది బడుల్లోనే..

– అందుకే విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత
– ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
భావి భారత సమాజం తయారు అయ్యేది బడుల్లో నే అని,అందుకోసమే ప్రజా సంక్షేమంలో ప్రధాన భూమిక వహించే విద్యాభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది అని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో మండలంలోని పలు అభివృద్ది,ప్రారంభోత్సవాల్లో బుధవారం ఆయన పాల్గొన్నారు. రూ.41.5 లక్షల “మన ఊరు – మన బడి” నిధులతో నిర్మించిన,పునరుద్ధరించిన పాఠశాలలను ఆయన లాంచనంగా ప్రారంభించారు. రూ.29 లక్షల అభివృద్ది పనులకు ఆయన శంఖుస్థాపన చేసారు. యోగ దినోత్సవం సందర్భంగా ముందుగా అశ్వారావుపేట లోని వి.కె.డి.వి.ఎస్ రాజు జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన యోగ పాల్గొన్నారు.యోగాసనాలు వేసారు.యోగ చెయ్యడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి విద్యార్థులకు వివరించారు. ఊట్లపల్లి లో రూ.5.5 లక్షలతో, పేరాయిగూడెం బీ.సీ కాలనీ రూ.25 లక్షలతో నిర్మించిన “మన ఊరు – మన బడి” పాఠశాల భవనాలను ప్రారంభించారు. అలాగే ఊట్లపల్లి లో గ్రామస్థుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముత్యాలమ్మ తల్లి అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారంవారిగూడెం కాలనీలో గ్రామస్థులు ఎమ్మెల్యే గారిని రోడ్డు కావాలని కోరగా రూ.9 లక్షలు మంజూరు చేశారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా మంజూరు చేసిన పంచాయతీ భవనం నిర్మాణ పనులకు కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి గ్రామ ప్రజలు మహిళలు కృతజ్ఞతలు తెలుపుతూ ఆప్యాయంగా మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ శ్రీరామమూర్తి ,జెడ్పీటీసీ వరలక్ష్మి,ఊట్లపల్లి,పేరాయిగూడెం,నారం వారి గూడెం,మల్లాయిగూడెం సర్పంచ్ లు సాధు జ్యోత్స్న బాయి,నార్లపాటి సుమతి,నారం రాధ,నారం రాజశేఖర్,వీకేడీవీఎస్ రాజు కళాశాల ప్రిన్సిపాల్ వెలుగోటి శేషుబాబు, ఊట్లపల్లి,బీసీ కాలనీ ప్రధానోపాధ్యాయులు మణి,బేబీ పద్మ,
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బండి పుల్లా రావు,మండల నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Spread the love