హమాలీల జీవితాలతో అటలాడితే ఊరుకోం: సీఐటీయూ డిమాండ్..

నవతెలంగాణ – జుక్కల్
ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఆల్ హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఆల్ హమాలీ ఫెడరేషన్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సురేష్ గోండ అన్నారు. ఈ సంధర్భంగా  నాయకుడు సురేష్ గొండ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీలకు వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ యూనిట్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షులు సురేష్ గోండ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగంలో ఎగుమతి దిగుమతులు నిర్వహిస్తున్న హమాలీలకు భవన నిర్మాణ కార్మికులగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ ఐ ప్రమాద బీమా, పెన్షన్ తదితర సౌకర్యాలతో పాటు హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గోదాముల దగ్గర మంచినీళ్లు, భోజనశాల,సైకిల్ స్టాండు, విశ్రాంతి గదులు నిర్మించాలని, ప్రభుత్వ సంస్థల లో ఎగుమతి దిగుమతి పనులు చేస్తున్న హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఐఎల్క తీర్మానం ప్రకారం 50 కేజీల బస్తాలను అన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Spread the love