ఎమ్మెల్యేను కలసిన సీఐటీయూ నాయకులు

నవతెలంగాణ-తుర్కయంజాల్‌
తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న స్వచ్ఛ ఆటో కార్మిక సంఘం నాయకులు సీఐటీయూ ఆధ్వ ర్యంలో శనివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డిని తొర్రూరులోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యా లయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తర్వాత పుష్ప గుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు డి.కిషన్‌ మాట్లాడుతూ తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీలో చెత్త డంపింగ్‌ యార్డ్‌ లేకపోవడంతో చెత్తను డంప్‌ చేయ డానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనివార్య పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ఉప్పల్‌, నాగోల్‌, రామాంతపూర్‌ లాంటి ప్రాంతాలకు వెళ్లి అక్కడి అధికారులకు, సూపర్‌ వైజర్లకు లంచాలు ముట్టజెప్పి మరి చెత్తను డంప్‌ చేయాల్సి వస్తోందని ఆరోపించారు. 5 ఏండ్ల నుండి ఇంటింటికీ తిరిగి ఆయా ఇంటి యజమానులు ఇచ్చే కేవలం వంద రూపాయలతోనే జీవనం సాగిస్తున్నారనీ, పెరుగుతున్న ధరలతో పోల్చుకుంటే వచ్చే ఆదాయం పెట్రోల్‌, డీజిల్‌ ఇతర ప్రయాణపు ఖర్చులకే సరిపోవడం లేదని అన్నారు. ఈ నూతన సంవత్సరం నుండి స్వచ్ఛ కార్మికులకు ఇంటికి రూ.150 చొప్పున పెంచేందుకు మున్సిపల్‌ కౌన్సిల్‌లో తీర్మానం చేయించాలని, తుర్కయంజాల్‌ మున్సిపల్‌ పరిధిలో శాశ్వత డంపింగ్‌ యార్డ్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఏం. సత్యనారాయణ, స్వచ్ఛ ఆటో కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌. వస్రయ్య, ఏ రామకష్ణ కోటయ్య, సిద్ధూ, జహంగీర్‌, రాజు, సీతారాములు, సతీష్‌, కళ్యాణ్‌, చిన్న బాలు, భీమేష్‌, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Spread the love