జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి: సీఐటీయూ

– జుక్కల్ ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్న మెమొరాండం
నవతెలంగాణ – జుక్కల్
ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్( సీఐటీయూ) జుక్కల్ మండలం కమిటీ ఆధ్వర్యంలో  ఎంపిడీవో ఆఫీస్ ముందు ధర్న నిర్వహించి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అనంతరం సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ మాట్లాడుతూ జుక్కల్ మండలం  లో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులకు గత 8 నెలలు గా చాలా గ్రామ పంచాయతీ కార్మికుల కు జీతాలు ఇవ్వడం లేదని ఇప్పటికే చాలిచాలని వేతనాలు తో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అయిన ఈ జీతాలు నెలల తరబడి ఇవ్వడం లేదని కావున పెండింగ్లో ఉన్న వేతనాలు ఏడు నుండి ఎనిమిది నెలల వరకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 51 జీవో సవరించాలని మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని కార్మికుల కు ఇన్సూరెన్స్ చేయాలని పాత కేటగిరీల విధానాన్ని కొనసాగించాలని, కారోబార్ బిల్ కలెక్టర్ల ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని జీవో నెంబర్ 60 ప్రకారం పంచాయతీ ఉద్యోగులకు వేతనాల అమలు చేయాలని  ఐదు లక్షల ఇన్సూరెన్స్అమలుకు   సంబంధించిన విధి విధివిధానాలు ఖరారు చేయాలని  ఈరోజు జుక్కల్  ఎంపీడీవో ఆఫీసు ముందు ధర్న నిర్వహించి  ఎంపీడీవో  కార్యలయం అధికారులకి  మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జుక్కల్ మండల అధ్యక్షులు గోవింద్, కార్మికులు ఈరయ్య, గంగారాం, సాయిలు, మారుతీ,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love